ఆంధ్రప్రదేశ్‌

ఉద్యోగులకు రాయితీల్లో రాజీ పడం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు కల్పించాల్సిన రాయితీల విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రశక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఇది ఉద్యోగుల ప్రభుత్వమని, అయితే ఉద్యోగులంతా మరింత బాధ్యతగా పనిచేస్తూ స్వర్ణాంధ్ర సాధనకు తోడ్పాటు అందించాలని కోరారు. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు నేతృత్వంలో 32 ఉద్యోగ సంఘాల ప్రతినిధుల బృందం మంగళవారం సీఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయా సంఘాల క్యాలెండర్లు, డైరీలను బాబు ఆవిష్కరించారు. బొప్పరాజు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, 70ఏళ్లు నిండిన విశ్రాంత ఉద్యోగులకు 15శాతం అదనపు పెన్షన్ తక్షణం మంజూరు చేయాలని, ఎన్‌ఎంఆర్, రోజువారీ వేతన కూలీలు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, పీఆర్‌సీ నివేదిక వెల్లడిలో జాప్యం జరుగుతోందని, తక్షణం ఇంటీరియం రిలీఫ్ ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ సెక్రటరీ జనరల్ టీవీ ఫణిపేర్రాజు, కోశాధికారి మురళీకృష్ణ నాయుడు, కోచైర్మన్‌లు ఆల్ఫ్రెడ్, నారాయణరెడ్డి, ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.