ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్టాత్మకంగా జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జనవరి 1: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జన్నభూమి- మావూరు కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లకు పైగా జరిగిన అభివృద్ధి, విభజన అనంతరం రాష్ట్ర పరిస్థితి భవిష్యత్ ప్రణాళికలను నిర్దేశిస్తూ గత పదిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శే్వతపత్రాలతో పాటు గ్రామసభల ద్వారా ఆయా గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని అంచనావేస్తూ భవిష్యత్‌లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించటమే ఈ జన్మభూమి ప్రధాన అజెండా. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
కార్యక్రమానికి విధిగా హాజరు కావాలని ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీశ్రేణులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరోవైపు అధికారులు రోజూ గ్రామసభలు నిర్వహించి సమస్యలు ఉత్పన్నమైతే ప్రభుత్వానికి నివేదించాలని ఆదేశించారు. పదిరోజులు పది అంశాలపై జన్మభూమి గ్రామసభలు నిర్వహిస్తారు. గ్రామసభల అనంతరం ఈనెల 11 తరువాత జిల్లాల వారీగా విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తారు.
నెలాఖరుకు రాష్ట్ర స్థాయి లక్ష్యాలను నిర్దేశించుకుని గ్రామాలు, పట్టణాల్లో అవసరమైన వౌలిక వసతుల కల్పన, ఆర్థిక పరిపుష్టికి అవసరమైన కార్యాచరణ రూపొందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివరించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకం కావాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు.
జన్మభూమి- మావూరు కార్యక్రమం పదిరోజులు 10 అంశాలతో ప్రభుత్వం నిర్దేశించింది. తొలిరోజు రాష్ట్ర పునర్విభజన చట్టంపై గ్రామసభల్లో చర్చ జరుగుతుంది. రెండోరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు- అభివృద్ధి, 3వ రోజు సంక్షేమం- సామాజిక సాధికారత, 4వ రోజు రైతాంగ సంక్షేమం- ఆహారభద్రత, ప్రకృతి సేద్యం, 5వ రోజు సహజవనరులు, జలసంరక్షణ, గ్రీన్‌విజన్, క్వాలిటీ ఆఫ్ లైఫ్, 6వ రోజు మానవ వనరుల అభివృద్ధి, వైద్యం, ఆరోగ్యం, విద్యపై చర్చిస్తారు. 8వ రోజు ఇంధనరంగం, ముఖ్య వౌలిక వసతులు, 9వ రోజు పరిశ్రమలు- ఉపాధి- నైపుణ్యాభివృద్ధి, 10వరోజు సుపరిపాలన, ఈ-ప్రగతి, శాంతిభద్రతల అంశాలపై గ్రామసభలు నిర్వహిస్తారు.