ఆంధ్రప్రదేశ్‌

వైఎస్ ఆశయ సాధనకు కృషి చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వజ్రపుకొత్తూరు, జనవరి 1: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి వైఎస్ ఆశయ సాధనకు కృషి చేద్దామని వైసీపీ అధినేత జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మంగళవారం ఒంకులూరు సమీపంలో రాత్రి బస చేసిన వేదిక వద్ద 2019 నూతన సంవత్సర వేడుకలను అభిమానులు, కార్యకర్తల మధ్య నిర్వహించారు. ప్రజాసంకల్ప పాదయాత్ర పొడవుప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివి అన్నారు. పాదయాత్రలో భాగంగా అనకాపల్లిలో తిత్లీ, కిడ్నీ బాధితులతో మాట్లాడారు. టీడీపీ మద్దతుదారులే తిత్లీ పరిహారాలు అందుకున్నారని దారి పొడవునా బాధితులు చెబుతున్నారని అన్నారు. కిడ్నీ బాధితుల కోసం ప్రత్యేకంగా పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో పాటు, రూ.10 వేల పింఛను అందిస్తామన్నారు. చిన్నారులకు అక్షరభ్యాసాలు చేసి ఆశీర్వదించారు. అనంతరం మందస మండలంలోకి పాదయాత్ర ప్రవేశించింది. పార్టీ నేతలు దువ్వాడ శ్రీనివాస్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

చిత్రం..కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తున్న వైసీపీ అధినేత జగన్