ఆంధ్రప్రదేశ్‌

ఇది నా పుస్తకం అదృష్టం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: తాను రచించిన పుస్తకాన్ని విజయవాడలోని ప్రముఖుల మధ్య ఆవిష్కరించినందుకు చాలా ఆనందంగా ఉందని ప్రముఖ చరిత్రకారుడు, మహాత్మా గాంధీ మనవడు ఆచార్య రాజమోహన్ గాంధీ అన్నారు. నవభారత ప్రకాశరావు ప్రాంగణంలో యద్దనపూడి సులోచనారాణి సాహిత్య వేదికపై ఎన్టీఆర్ ట్రస్ట్, సాంస్కృతిక శాఖ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన 30వ పుస్తక మహోత్సవాన్ని మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ముఖ్యఅతిథిగా ఆచార్య రాజమోహన్ గాంధీ మాట్లాడుతూ గాంధీజీ గురించి తనను చాలా మంది అడుగుతూ ఉంటారని, గాంధీజీ స్వాతంత్య్ర సమరయోధులే కాదు, జర్నలిస్ట్ కూడా అని తాను చెబుతుంటానన్నారు. 1904లో దక్షిణాఫ్రికాలో ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను స్థాపించారని, దేశానికి తిరిగి వచ్చి యంగ్ ఇండియన్, హరిజన్ అనే పత్రికలు స్థాపించారని చెప్పారు. ఈసందర్భంగా రాజమోహన్ గాంధీ రచించిన ‘మోడ్రన్ సౌత్ ఇండియన్’ పుస్తకాన్ని శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పుస్తక ప్రచురణకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉండేదన్నారు. ఈ పుస్తక మహోత్సవం పాఠకాభిరుచికి మరింత దోహదపడుతుందన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆర్వీ సిసోడియా మాట్లాడుతూ సాహిత్యానికి సాంస్కృతిక రాజధానిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పుస్తక ప్రచురణలో ప్రముఖ పాత్రను పోషిస్తోందన్నారు. 30 సంవత్సరాలుగా పుస్తక మహోత్సవాలను నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు. జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం మాట్లాడుతూ కలంతో రాసే వాక్యం హృదయాన్ని కదిలిస్తుందన్నారు. విజ్ఞానంతో కూడిన సొసైటీ రావాలని ఆకాంక్షించారు. నగర మేయర్ కోనేరు శ్రీ్ధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ వచ్చిన తరువాత ఇబ్బందులు, సౌకర్యాలు ఉన్నాయని, హీరోలకు ఇచ్చే ప్రాముఖ్యత దేశ నాయకులకు ఇవ్వడంలేదని వాపోయారు. జాతీయ నేతల ప్లెక్సీలు ఎక్కడా కన్పించవని, అయితే సినీ యాక్టర్ల ప్లెక్సీలు ఎడాపెడా కన్పిస్తుంటాయన్నారు. వీటికి పిల్లల వద్ద అంతటి డబ్బు ఎలా ఉంటోందో, తల్లిదండ్రులు ఇస్తున్నారా? లేక ఎక్కడైనా కాజేస్తున్నారా? అంతుబట్టటం లేదన్నారు. జూదంలా రాజకీయం కూడా ఓ వ్యసనమన్నారు. తానెక్కడయినా లంచం తీసుకున్నానని నిరూపిస్తే యావదాస్తిని రాసిస్తానని సవాల్ చేశారు. ఎమెస్కో అధినేత విజయ్‌కుమార్ స్వాగతోపన్యాసం చేశారు.
ప్రముఖ రచయిత కొలకలూరి ఇనాక్ జ్యోతిప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో రాజమోహన్ గాంధీ సతీమణి ఉషాగాంధీ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు వెంకటనారాయణ, గౌరవాధ్యక్షుడు బాబ్జీ, ప్లానింగ్ కమిషన్ పెద్ది రామరావు, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు దీర్ఘాసి విజయ్‌భాస్కర్, కవి గౌరీశంకర్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రాలు.. విజయవాడలో మంగళవారం పుస్తక మహోత్సవాన్ని ప్రారంభిస్తున్న రాజమోహన్ గాంధీ తదితర ప్రముఖులు, *రాజమోహన్ గాంధీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మండలి బుద్ధప్రసాద్, తదితరులు