ఆంధ్రప్రదేశ్‌

హ్యాపీ న్యూ ఇయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 1: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడ కనకదుర్గ దేవస్థానం పండితులు ఆశీర్వదించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా, డీజీపీ ఠాకూర్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సతీష్ చంద్ర, ఏవీ రాజవౌళి, గిరిజా శంకర్, సాయి ప్రసాద్, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ ముఖ్య నేతలు వివివి చౌదరి, టీడీ జనార్ధన్, విజయవాడ మేయర్ శ్రీ్ధర్ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ నున్నలోని మానసిక వికలాంగుల సంఘంలో ఆశ్రయం పొందుతున్న మానసిక వికలాంగులు కూడా ముఖ్యమంత్రికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
మానసిక వికలాంగులను చూసిన వెంటనే ముఖ్యమంత్రి వారి వద్దకు వెళ్లి అప్యాయంగా పలుకరించి, వారి శుభాకాంక్షలను అందుకున్నారు. వారి యోగ క్షేమాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.