ఆంధ్రప్రదేశ్‌

చిన్నారి కిడ్నాప్ కథ సుఖాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జనవరి 1: తిరుమలలో ఐదు రోజుల కిందట శుక్రవారం కిడ్నాప్‌కు గురైన మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన వీరేశ్ (18నెలలు)ను మంగళవారం తిరుపతి అర్బన్ ఎస్పీ కార్యాలయంలో బాలుడి తల్లిదండ్రులు ప్రశాంత్ జీ యాదవ్, స్నేహలకు ఎస్పీ అన్బురాజన్ అందించారు. దాదాపు 100 గంటల తరువాత బిడ్డ సురక్షితంగా చేరడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. నాలుగు రోజుల తరువాత తల్లిదండ్రులను చూసిన బాలుడు కూడా తల్లి ఒడిలో చేరి గట్టిగా కౌగిలించుకోవడం చూపరులను కంట తడిపెట్టించింది. వాస్తవానికి డిసెంబర్ 30న కిడ్నాపర్ విశ్వంభర్‌ను, బాలుడిని మహారాష్టల్రోని నాందేడు జిల్లా మాహూర్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాందేడులోని రేణుకాదేవి ఆలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండటం, సోషల్ మీడియాలో కిడ్నాపర్, బాలుడి ఫొటోలను గమనించిన ఓ వ్యక్తి మాహూర్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే స్పందించి విశ్వంభర్‌ను, బాలుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అర్బన్ ఎస్పీ అన్బురాజన్ సీఐ రామకృష్ణతో కూడిన బృందాన్ని మహారాష్టక్రు పంపించారు. మహారాష్టల్రో బాలుడిని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నా న్యాయపరమైన అంశాలకు సంబంధించి కొంత జాప్యం జరిగి చివరకు వీరేశ్‌ను తల్లిదండ్రుల ఒడికి చేర్చిన అర్బన్ పోలీసులను పలువురు అభినందించారు. ఈసందర్భంగా ఎస్పీ అన్బురాజన్ మాట్లాడుతూ 27వ తేదీన ప్రశాంత్ జీ యాదవ్ కుటుంబ సమేతంగా తిరుమలకు వచ్చినప్పటి నుంచి కిడ్నాప్ జరిగిన సంఘటన నుంచి కథ సుఖాంతం అయినంత వరకు జరిగిన సంఘటనలను వివరించారు. కిడ్నాప్ సమాచారం తెలిసిన వెంటనే ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో కిడ్నాపర్ సులభంగా దొరికాడన్నారు. సోమవారం నిందితుడిని, బాలుడిని తీసుకువచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్‌తో కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. టీటీడీ ఈఓ ఏకే సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు, సీవీఎస్వో గోపీనాథ రెడ్డిలు ఈ కేసు ఛేదనలో ఎంతో సహకరించారని, వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కేసును ఛేదించడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందికి రివార్డులు ఇవ్వనున్నట్లు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలావుండగా కిడ్నాపర్ ఐ.విశ్వంభర్ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ వాసి. ఈయన పోలీసుల విచారణలో ఆసక్తికరమైన విషయాలను చెప్పాడు. ముందుగా వీరేశ్ తన బిడ్డేనని చెప్పుకున్నా, తాను మేస్ర్తిపని చేసుకుని జీవనం సాగిస్తున్నానని, తనకు 43 సంవత్సరాలని, అవివాహితుడని అన్నారు. తరచూ తిరుమలకు వస్తుంటానని అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తుంటానని చెప్పారు. ఒక చిన్న బిడ్డను పెంచుకుంటే వృద్ధాప్యంలో తనకు ఆసరాగా ఉంటాడనే ఉద్దేశ్యంతోనే వీరేశంను కిడ్నాప్ చేసినట్లు వివరించాడు.
చిత్రం..తల్లిదండ్రులకు చిన్నారిని అప్పగిస్తున్న తిరుమల పోలీసులు