ఆంధ్రప్రదేశ్‌

శే్వతపత్రాలపై చర్చ పెట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 2: ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రాలపై చర్చజరపాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. శే్వతపత్రాలపై ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావాలంటే వాటిపై నిశితంగా చర్చ జరగాలన్నారు. ప్రభుత్వ ప్రతినిధులు ఎవరొచ్చినా చర్చించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ విడుదల చేస్తున్న శే్వతపత్రాల తాలూకు వాస్తవాలు క్షేత్ర స్థాయిలో రుజువు కావాల్సివుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఉండవల్లి విలేఖర్లతో మాట్లాడారు. తాను అనేకసార్లు అనేక అంశాలపై శే్వతప్రతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశానని, ఎట్టకేలకు శే్వతపత్రాలు విడుదలవుతున్నాయన్నారు.తాజాగా పరిశ్రమలకు సంబంధించి విడుదలచేసిన శే్వత పత్రంలో అసెంబ్లీలో ఇచ్చిన సమాధానమే ఉందని, రూ.18 లక్షల కోట్లు పెట్టుబడితో రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తే సత్యాలు తేటతెల్లమవుతాయన్నారు. తన సొంత ఖర్చులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి సిద్ధమని,ప్రభుత్వ ప్రతినిధులెవరైనా రావచ్చన్నారు. రాష్ట్రానికి రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నప్పటికీ కనీసం రూ.1.5 కోట్లు కూడా రాలేదని ధ్వజమెత్తారు. 60సీ నిబంధనను వక్రీకరించి పోలవరంలో పనులు అప్పగిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. రూ.కోట్ల విలువైన పనులు నామినేషన్లపై ఇవ్వడానికి తాజాగా టనె్నల్ పనుల ప్యాకేజీలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సీఎం ఎంతో హడావిడిగా ప్రారంభించిన పోలవరం గేట్ల అమరిక ఇంకా ఉరి కొయ్యకు వేలాడుతున్నట్టుగా ఉన్నట్టుందని, సాంకేతికంగా అది పూర్తి కావాలంటే కనీసం నెల రోజులైనా పడుతుందన్నారు. కడప స్టీల్ ప్లాంట్ కంటే పెద్ద మోసం మరోటి లేదన్నారు. పునర్విభజన చట్టంలోని 108 క్లాజు గడువును పెంచాలని తాను లేఖ రాస్తే పట్టించుకోలేదని, కనీసం చంద్రబాబునాయుడు అప్పట్లో స్పందించివుంటే, ఇపుడు గడువుఉండేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముఖ్యమంత్రి మేలో నీళ్ళిస్తామని చెప్పడం పచ్చి అబద్ధమని, మేలో ఏ విధంగా ఇస్తారో అర్ధం కావడం లేదని ఉండవల్లి పేర్కోన్నారు. అదే నిజమైతే నీళ్ళిచ్చేందుకు ఆరు నెలల ముందే సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎల్‌ఈడీ బల్బుల ధరల్లో కూడా భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు. ఒక్కో బల్బుకు రూ.6000 వంతున చెల్లించి, పదేళ్లలో 10వేల గంటలు వెలిగే విధంగా ఒప్పందమని, ఈ కాలంలో ఏదైనా బల్బు పోతే కాంట్రాక్టు సంస్థ రీప్లేస్ చేయాల్సివుందన్నారు. అయితే రూ.600 విలువైన బల్బుకు రూ.6000 చెల్లిస్తున్నారని, ఇంత అవినీతి కళ్ళకు కట్టినట్టు కన్పిస్తుంటే, చంద్రబాబునాయుడు నిప్పులాంటి మనిషి అని పదే పదే ఎలా అంటారని నిలదీశారు. ఒకవైపు బీజేపీ మోసం చేసిదంటున్న ముఖ్యమంత్రి మరో వైపు శే్వతపత్రాల్లో గణాంకాలను బట్టి చూస్తుంటే దేశంలోనే అన్నింటా ముందున్నామని చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. అందుకే ఒక్కో శే్వతపత్రంపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నానని, అమరావతిలోనే చర్చ పెట్టాలని ఉండవల్లి కోరారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సెల్ ఫోన్లలో, అన్నా క్యాంటీన్ల నిర్మాణంలోనూ భారీ అవినీతి చోటు చేసుకుందని ఆరోపించారు.