ఆంధ్రప్రదేశ్‌

పింఛనుదారులు ఇకపై డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్లు సమర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలోని పింఛనుదారులు ఇకపై జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్ సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి పీయూష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ కేంద్రాలు, మీ-సేవ కేంద్రాలు, పింఛను సర్వీస్ అసోసియేషన్స్, గుర్తింపు పొందిన వారి నుంచి డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్‌ను సమర్పించవచ్చు. ఈ సేవలు ఉపయోగించుకున్నందుకు వినియోగదారులు కొంత రుసుం చెల్లించాల్సి ఉంటుంది. సబ్‌ట్రెజరీలు, ట్రెజరీల్లో కూడా డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్లను అందచేయవచ్చు. వేలి ముద్రలు పడనివారి వద్ద నుంచి ఐరిష్ స్కానర్ల ద్వారా సమర్పించవచ్చు, అది కూడా అందుబాటులో లేకపోతే భౌతికంగా తీసుకుంటారు. కదలలేని పరిస్థితుల్లోని పింఛనుదారులు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే ఇవ్వచ్చు. సాధ్యం కాకుంటే భౌతిక జీవన పత్రం జారీ చేస్తారు. ఆ పత్రం ఎస్టీవోకు అందాక, వీడియో కాలింగ్ ద్వారా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు. డిజిటల్ లైఫ్ సర్ట్ఫికెట్ సమర్పించకపోతే ఇచ్చే వరకూ నిలిపివేస్తారు. 2020 నుంచి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఈ సర్ట్ఫికెట్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.