ఆంధ్రప్రదేశ్‌

సమన్వయంతో పనిచేస్తే సత్ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేస్తే, ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు వీలు కలుగడమే కాకుండా, ప్రజల మన్ననలు పొందుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా తెలిపారు. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, ఉన్నతాధికారులతో సమీక్ష బుధవారం ఆయన నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నెలలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్సులో కొన్ని శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారని గుర్తు చేశారు. పౌర సరఫరాల శాఖ ప్రజల సంతృప్తి శాతాన్ని 90కి పైగా ఉండేలా చూడాల్సిందేనన్నారు. ప్రస్తుతం 81 శాతంగా ఉందని గుర్తు చేశారు. ఇంటింటికీ కుళాయి కనెక్షన్లలో భాగంగా ప్రతివారం మున్సిపల్, జలవనరుల శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించుకుంటూ మంచినీటి సరఫరాలో అడ్డంకులను అధిగమించాలన్నారు. ప్రభుత్వ పథకాలు విజయవంతం కావాలంటే అధికారుల్లో చిత్తశుద్ధి అవసరమన్నారు.