ఆంధ్రప్రదేశ్‌

అవినీతి రహిత రాష్టమ్రే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 2: ఆంధ్రప్రదేశ్‌ను పూర్తి స్ధాయి అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్ ఆర్‌పీ ఠాకూర్ అన్నారు. అవినీతి నిర్మూలనలో రాష్ట్రం 19వ స్ధానం నుంచి మూడవ స్ధానానికి చేరుకుందన్నారు. రాష్ట్ర ఏసీబీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరిన్ని సంస్కరణలతో అవినీతి రహిత రాష్ట్రాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానానికి చేరుకునేలా మరింత కృషి చేస్తామని అన్నారు. అవినీతి నిర్మూలన కోసం ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు సోషల్ మీడియా వినియోగం తమకు మరింత దోహదపడిందని, అదేవిధంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేస్తామన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు నిర్వహించే విషయంలో సీబీఐకి అనుమతి నిరాకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంతో ఏసీబీ భాధ్యత మరింత పెరిగిందన్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై అవినీతి కేసు నమోదు చేశామన్నారు. నిజాయితీగా పని చేసేవారు భయపడాల్సిన అవసరం లేదని, అవినీతికి పాల్పడేవారిని మాత్రం వదిలేది లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న అకౌంట్లపై తాము ఆరా తీస్తున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదన్నారు. 2018లో ఏసీబీ రాష్టవ్య్రాప్తంగా 31 అక్రమాస్తుల కేసులు నమోదు చేయగా.. 54.72 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసిందన్నారు. అదేవిధంగా లంచం తీసుకుని అవినీతికి పాల్పడిన ఘటనలకు సంబంధించి రాష్టవ్య్రాప్తంగా 107 ట్రాప్ కేసులు నమోదు చేసి మొత్తం రూ. 21.64 లక్షలు సీజ్ చేశామని వెల్లడించారు. నమోదైన కేసుల్లో నిందితులపై కోర్టు విచారణలో సమర్థవంతంగా వాదనలు వినిపించి దోషులకు శిక్షలు పడేలా కృషి చేశామన్నారు. 2017లో 52శాతం శిక్షల శాతం ఉండగా, 2018లో 57శాతానికి పెరిగిందన్నారు. ఏసీబీకి ప్రభుత్వం నుంచి పూర్తిస్ధాయి సహకారం లభిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఏసిబి కార్యాలయాలకు స్వంత భవనాల నిర్మించామని, ప్రభుత్వం నుంచి రూ. 15.94 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. భవన నిర్మాణాలు ఆరు మాసాల నుంచి సంవత్సరం లోగా రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. అదేవిధంగా అదనంగా 2018లో వివిధ కేడర్‌కు చెందిన 350 మంది సిబ్బందిని ప్రభుత్వం మంజూరు చేసిందని, రాష్ట్ర విభజన తర్వాత ఇంత మంది సిబ్బందిని పెంచడం తొలిసారన్నారు. అధికారులు, సిబ్బందికి కొత్త వాహనాల కొనుగోలు కోసం ప్రభుత్వం కోటి రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. టోల్‌ఫ్రీ, ఇ మెయిల్, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాను ఏసిబి పూర్తిస్ధాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రజల నుంచి స్పందన లభిస్తోందని, అవినీతి నిర్మూలన పట్ల ప్రజలను మరింత చైతన్య పరిచేందుకు నేరుగా వారి వద్దకే వెళ్లి అవగాహన ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. విలేఖరుల సమావేశంలో డైరెక్టర్లు శంకర భ్రత బాగ్చి, చీఫ్ లీగల్ అడ్వయిజర్ ఎం వెంగయ్య, హరికుమార్, అబ్రహాం లింకన్, షరీన్‌బేగం పాల్గొన్నారు.