ఆంధ్రప్రదేశ్‌

సంపద సృష్టితో ఆర్థిక వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వద్దన్నా వచ్చిన విభజనతో అంతా అయోమయం. రాజధాని ఎక్కడంటే ఏం చెప్పాలో తెలీని పరిస్థితి. స్వరాష్ట్రంలో పరిపాలనకు సొంత భవనాల్లేవు. అధికార యంత్రాంగానికి సౌకర్యాల్లేవు. అన్నింటినీ మించి ఆర్థిక కష్టాలు. ఈ స్థితిలో సరిగ్గా నాలుగున్నరేళ్లు గడిచేసరికి ఆర్థిక వృద్ధిరేటు ఎలా ఉంటుందన్న ఆందోళన మాయమై.. దేశంలోనే అత్యధిక వృద్ధిరేటును సాధించింది ఆంధ్ర రాష్ట్రం. బుడిబుడి నడకల నుంచి వడివడి పరుగుల నవ్యాంధ్రగా రూపాంతరం చెందింది. రూపాయి లేకున్నా వ్యూహాత్మకంగా నూతన రాజధాని అభివృద్ధికి ముందడుగు పడింది. పాలనా యంత్రాంగం ప్రజల చెంతకు వచ్చింది. పెట్టుబడులు పెట్టేందుకు మా రాష్ట్రం కూడా సిద్ధంగా ఉందని సగర్వంగా చెప్పడమే కాకుండా పెట్టేవారికి ఎంత సురక్షితమో, ప్రయోజనకరమో చెప్పగలిగింది. సొంత గడ్డపై నుంచే పాలన సాగిద్దామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునందుకుని ఉద్యోగులు తరలి రావడం, అమరావతికి భూములిస్తామంటూ రైతులు ముందుకు రావడం, ప్రవాసాంధ్రులూ చేయూతనివ్వడం ఏపీ ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేశాయి.
నిర్మాణాల్లో రికార్డు
డబ్బుల్లేవని గుడిసె వేసుకుని ఉండబోమని.. ప్రపంచంలోనే ఐదు అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని ఆత్మవిశ్వాసంతో చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో నిర్మాణాలకు టెండర్లు ముగించారు. వౌలిక వసతుల కల్పనలో భాగంగా సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు ఇతర రోడ్ల నిర్మాణమూ ప్రారంభించారు. అంతకంటే ముందు వెలగపూడి గ్రామంలో తాత్కాలిక సచివాలయాన్ని శరవేగంగా నిర్మించి చూపించారు. అంతే వేగంగా శాసనసభ నిర్మాణం పూర్తిచేశారు. తద్వారా నూతన రాజధానిని అనుకున్న స్థాయిలో నిర్మించగలమనే ఆశల్ని ప్రజల్లో నిలిపారు.
సవాళ్లను అధిగమించి..
సవాళ్లను అధిగమించేందుకు శ్రమిస్తూ, సంక్షోభాలను అవకాశంగా మలచుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు దోహదపడే కార్యక్రమాలను అమలుపరచటమే కాకుండా 7 మిషన్‌లు, 5 గ్రిడ్‌లు, మరో 5 క్యాంపెయినింగ్ మోడ్‌లతో వినూత్న చర్యలు చేపట్టింది. స్థూల విలువ చేర్పు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సమాజ, కుటుంబ వికాసం, కీలక పనితీరు సూచికలు అనే ఐదు ఇతివృత్తాలతో ఒక చారిత్రక పర్యవేక్షణ వ్యూహాన్ని రూపొందించింది. ఇబ్బందులను అధిగమించడమే కాకుండా సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడం ద్వారా ‘సూర్యోదయ ఆంధ్రప్రదేశ్’కు గట్టి పునాది వేయగలిగింది.
వృద్ధిరేటులో తొలి స్థానం
గత నాలుగేళ్లలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిరేటును నమోదు చేయగలిగింది. దేశ సగటు వృద్ధి 7.3శాతం, తెలంగాణ సగటు వృద్ధిరేటు 9.7శాతం కాగా, 10.52 శాతం (స్థిర ధరలతో) సగటు వృద్ధిని నమోదు చేయడం ద్వారా ఉత్తమ ఆర్థిక నిర్వహణదారుగా రాష్ట్రం నిలిచింది. ప్రస్తుత ధర ప్రకారం 2013-14లో రూ 4.64 లక్షల కోట్ల నుండి 2017-18 (ఏఈ)లో రూ 8.04 లక్షల కోట్లకు ఏటేటా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గణనీయంగా మెరుగుపడింది. నాలుగేళ్ల కాలంలో నికర పెరుగుదల రూ 3.4 లక్షల కోట్లుగా ఉంది. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జనాభాను 58,32-41,68 నిష్పత్తిలో విభజించారు. అయితే జీఎస్‌డీపీ వాటా 5.07, 49.3 దామాషాలో ఉంది. రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యత్యాసం రూ 12,692 కోట్లు మాత్రమే. గత నాలుగేళ్లలో ప్రస్తుత ధరలలో సగటు వృద్ధిరేటు 14.72 శాతంతో ఏపీ స్థిరమైన పనితీరు వల్ల రూ. 71,216 కోట్ల వ్యత్యాసం, 2017-18లో జీఎస్‌డీపీ వాటా 52.3, 47.7 దామాషాలో ఉంది. రాష్ట్ర విభజన సమయంలో అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, కోశ సంబంధిత సామాజిక పరిస్థితులు ప్రతికూలంగా ప్రభావితం అవుతాయని కేంద్ర ప్రభుత్వం ముందే గుర్తించినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. రాష్ట్ర విభజన వల్ల ఉత్పన్నమైన ప్రతికూల పరిస్థితులు, 2014 ఏపీఆర్‌ఏ చట్టంలోని హామీలు, నిబంధనలను నెరవేర్చడంలో కేంద్రం సహకరించక పోయినప్పటికీ రాష్ట్రం కష్టపడి ఆర్థిక, సామాజిక పరిస్థితులను మెరుగుపరచుకోగలిగింది. గడచిన నాలుగేళ్ల సగటు చూస్తే ఏపీ ఆర్థిక వృద్ధిరేటు 10.35 శాతంగా ఉంది. ఇది దేశ వృద్ధిరేటు, మిగిలిన అన్ని రాష్ట్రాల వృద్ధిరేటు కంటే ఎక్కువ. ప్రపంచ పోటీ సూచికలోనూ దేశ ర్యాంకు కంటే ఏపీ స్కోరు బాగుంది.
ఆర్థిక వ్యవస్థ స్వభావం
అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వ్యవసాయ స్వభావం కలిగింది. 2013-14 కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగం వాటా 23శాతంగా ఉంటే, విభజన సమయంలో ఇది 30.2 శాతం వరకు, 2017-18 కాలంలో మరింత పెరిగి 34.4 శాతానికి చేరింది. గత నాలుగేళ్లలో రుతుపవనాలు అనుకూలంగా లేకపోయినప్పటికీ జాతీయ సగటు వృద్ధిరేటు 2.4 శాతం ఉండగా, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో సగటు వృద్ధిరేటు 11 శాతంగా కనిపిస్తోంది. స్థూల నిబంధనల ప్రకారం ప్రస్తుత ధరల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-14 సంవత్సరంలో 1.28 లక్షల కోట్ల నుండి 2017-18 సంవత్సరంలో రూ 2.53 లక్షల కోట్ల వరకు గణనీయంగా పెరిగాయి. సుస్థిరతకు దారితీస్తున్న ఉద్యానవన, ఆక్వా కల్చర్ కలయిక విధానం, ప్రభావవంతమైన సహజవనరుల నిర్వహణ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రభుత్వం దృష్టిసారిస్తూ చేసిన కృషి ఫలితంగా గత నాలుగేళ్ల వ్యవధిలోనే రూ 1.25 లక్ష కోట్ల నికర పెరుగుదలతో దాదాపు రెండింతలైంది. పారిశ్రామికరంగ ఆర్థిక వ్యవస్థ 2013-14 సంవత్సరంలో రూ 1.07 లక్ష కోట్ల నుండి ప్రస్తుత ధరలతో 2017-18 సంవత్సరంలో రూ 1.62లక్షల కోట్లకు గణనీయంగా పెరిగింది. రూ 0.55 లక్ష కోట్ల నికర పెరుగుదల ఉంది. సమర్థవంతమైన సులభతర వ్యాపార నిర్వహణలో మొదటి స్థానానికి దారితీస్తున్న సమర్థవంతమైన పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయటం ద్వారా స్వదేశం, విదేశాలు రెండింటిలో పెట్టుబడులను చేజిక్కించుకుంటూ ప్రభుత్వం పారిశ్రామిక కార్యకలాపాలను అభివృద్ధి చేస్తోంది. సర్వీస్ రంగ ఆర్థిక వ్యవస్థ 2013-14లో రూ 1.90 లక్షల కోట్ల నుండి ప్రస్తుత ధరల్లో 2017-18లో రూ 3.20 లక్షల కోట్లకు గణనీయంగా పెరిగింది. అమరావతికి తరలించడం, సేవా రంగం, పరిశ్రమల రంగం, సులభతర వ్యాపార నిర్వహణలో వృద్ధి, పర్యాటక రంగాన్ని పెంచడానికి ఓడరేవులను ఏర్పాటు చేయడం, వౌలిక సదుపాయాల రంగం సేవా విభాగానికి మరింత ప్రోత్సాహాన్నిస్తోంది. ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్‌సీ వంటి ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థలు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్ల సర్వీస్ రంగంలో నిలకడగా ఆర్థిక వృద్ధి సాధ్యమైంది. ఆర్థిక పన్ను ఆదాయం, తలసరి ఆదాయం అధికంగా ఉత్పత్తి చేసే సేవారంగం సుమారు 43.5 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు అందిస్తోంది. ఇది ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే, అంటే తెలంగాణ 63.8 శాతం, తమిళనాడు 53.36, కర్ణాటక 66.27, కేరళ 64.41శాతం, అఖిల భారత సగటు 53.85 శాతాని కంటే చాలా తక్కువ. జీఎస్డీపీలో పన్ను రెవెన్యూ 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాలకు వరుసగా 14వ ఆర్థిక సంఘం అంచనా ప్రకారం 7.98, 8.26, 8.31 శాతానికి గాను 6.71, 6.32 శాతం, 6.6 శాతంగా ఉంది. ఆర్థిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా ఉన్న హైదరాబాద్‌ను కోల్పోయిన తరువాత పన్ను మూలాల్ని రాష్ట్రంలో ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. అవశేష రాష్ట్ర జీఎస్‌డీపీకి వ్యవసాయం నుండి ప్రధాన వాటా, సర్వీస్ రంగం నుండి వాటా తక్కువ ఉన్నందున జీఎస్‌డీపీ దామాషాకు పన్ను కూడా తక్కువగా ఉంది. హైదరాబాద్ నుండి అమరావతికి రాజధాని, కార్యాలయాలను తరలించడం 2015-16 నుండి ఉద్యోగుల వేతనస్కేళ్ల సవరణ, ఉపకార వేతనాలు, మధ్యాహ్న భోజన పథకం, ఆహార చార్జీలు, రైతులకు రుణమాఫీ, సామాజిక భద్రతా పింఛన్లలో ఐదురెట్ల పెరుగుదల, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు మూలధన చేర్పు వంటి వివిధ సంక్షేమ కార్యక్రమాల రేట్లలో పెరుగుదల వంటివి రెవెన్యూ ఆదాయం పెరుగుదలకు ప్రధాన కారణం. అశాస్ర్తియ విభజన వల్ల భారీ రుణం వారసత్వంగా వచ్చి, దానికితోడు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్రం సహాయ నిరాకరణ వైఖరి రాష్ట్ర ఆర్థిక వనరులపై మరింత ఒత్తిడిని పెంచింది. ఏమైనప్పటికీ ఆర్థిక ఆటంకాలను తొలగించుకుంటూ తక్కువ వడ్డీకి రుణాలు సమీకరించడం, పునర్వ్యవస్థీకరించడం ద్వారా లక్ష్యాలను అధిగమిస్తోంది. ప్రభుత్వం పరిమిత వనరులతో అత్యధిక ఫలితాలను సాధించడానికి వినూత్న ఆలోచనలు, సమ్మిళిత విధానాన్ని ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అవలంభిస్తోంది. సుస్థిర ప్రాతిపదికన ఆర్థిక వ్యవస్థలో స్థూల విలువ చేర్పును పెంచటానికి పేదరిక నిర్మూలనకు దారితీసే సంపద సృష్టి కోసం ఎకో సిస్టంను అభివృద్ధి చేయటానికి దార్శనికతగా ఉంది. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి, సంపద సృష్టి ఉండేలా చూడటానికి సహజ వనరుల వ్యూహాత్మక నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది.