ఆంధ్రప్రదేశ్‌

అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జనవరి 2: రాష్ట్రంలో అభివృద్ధి కావాలో.. అరాచకం కావాలో ప్రజలే తేల్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. బుధవారం ఇక్కడ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ బూత్ కన్వీనర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విలేఖరులతో ఆయన మాట్లాడుతూ దేశంలో అవినీతి రహిత పాలన, అభివృద్ధి కొనసాగాలంటే ప్రధానిగా మోదీ అధికారంలోకి రావాలన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసత్య ప్రచారాలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టుకు నాసా ఆంక్షలు విధించగా ప్రత్యమ్నాయ స్థలం చూపమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరగా, నేటి వరకు ప్రత్యమ్నాయం చూపలేదన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు ముడి సరకు కొరత ఉందని చెప్పిన వారం రోజుల్లోనే చంద్రబాబునాయుడు శంకుస్థాపన ఎలా చేశాన్నారని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కో కన్వీనర్ సునీల్ దియోధర్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహన్, జిల్లా ఇన్‌ఛార్జి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,
పక్కన రాష్ట్ర కో కన్వీనర్ సునీల్ దియోధర్, పాకలపాటి సన్యాసిరాజు తదితరులు