ఆంధ్రప్రదేశ్‌

బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జనవరి 2: టీడీపీ ప్రభుత్వం బీసీలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పించ లేదని, సంక్షేమ పథకాల మంజూరులోనూ విఫలమైందని వైసీపీ బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. బీసీ కులాలు, వర్గాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు విశాఖ వచ్చిన కమిటీ సభ్యుల బృందం బుధవారం బీసీ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్టవ్య్రాప్తంగా 52శాతం ఉన్న బీసీలకు కనీస ప్రాతినిధ్యం కల్పించకుండా, కేవలం ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కోట్లాది రూపాయాలు ఖర్చు చేశామని ప్రకటిస్తున్నారే తప్ప, వాస్తవానికి అర్హులైన వారికి బ్యాంక్ రుణాలు, పథకాలు అందడం లేదున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించి బీసీలకు అవసరమైయ్యే పథకాలు, తదితర వాటిని గుర్తించేందుకు ప్రత్యేకంగా అధ్యయన కమిటీని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర పర్యటన అనంతరం బీసీల సమస్యలపై ప్రత్యేక నివేదికను తయారు చేసి ఆ నివేదికను వైసీపీ అధినేత జగన్‌కు అందించి, వచ్చే ఎన్నికల్లో బీసీలకు రాజకీయ ప్రాధాన్యతను కల్పిస్తామన్నారు. ఈ సమావేశంలో బీసీ అధ్యయన కమిటీ రాష్ట్ర సభ్యులు నరసయ్య గౌడ్, అవాల ముసలయ్య, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.