ఆంధ్రప్రదేశ్‌

జన్మభూమిపై ప్రజా స్పందన తెలుసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమంపై ప్రజా స్పందన తెలుసుకోవాలని ఆర్టీజీఎస్ సీఈవో బాబు అహ్మద్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో జన్మభూమి కార్యక్రమ ఏర్పాట్లపై బుధవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమికి సంబంధించి ప్రజల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. రోజువారీ నివేదికలను సకాలంలో సేకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మేరకు నిర్దేశిత ఫార్మాట్‌ను క్షేత్ర స్థాయి వరకూ పంపాలన్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ను అందించాలని ప్రణాళికా విభాగం కార్యదర్శి సంజయ్ గుప్తాను ఆదేశించారు. ఇంకా కొన్ని గ్రామాల్లో వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులతో మల్టీ డిసిప్లినరీ బృందాలను ఏర్పాటు చేయకపోవడాన్ని ప్రస్తావించారు. బుధవారం సాయంత్రం నాటికి వాటిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలు, వార్డుల వారీగా జన్నభూమి కార్యక్రమాల షెడ్యూల్‌ను ప్రకటించాలన్నారు.

చిత్రం..జన్మభూమి కార్యక్రమంపై సమీక్షిస్తున్న సీఎస్ పునేఠా