ఆంధ్రప్రదేశ్‌

రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం చారిత్రక తప్పిదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జనవరి 2: శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాష్ట్ర హైకోర్టును ఏర్పాటు చేయకపోవడం చారిత్రిక తప్పిదమేనని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ఆంధ్రరత్నభవన్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో భాగంగా జరిగిన హైకోర్టు విభజన ప్రక్రియలో అధికార వికేంద్రీకరణ సూత్రాన్ని విస్మరించడం శోచనీయమన్నారు. ముఖ్యమంత్రితోపాటు ప్రతిపక్ష నాయకుడు కూడా రాయలసీమవాసులే అయినప్పటికీ ఈ తప్పిదం జరగడం దురదృష్టకరమన్నారు. దేశంలో 12 రాష్ట్రాలలో రాజధాని ప్రాంతం, హైకోర్టు భవనాలు వేర్వేరు ప్రదేశాల్లో ఉన్నాయని, అలాగే దేశంలో 9 రాష్ట్రాలలో హైకోర్టు బెంచీలు ఉన్నాయన్నారు. కనీసం హైకోర్టు బెంచీనైనా రాయలసీమలో ఏర్పాటు చేయాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు.