ఆంధ్రప్రదేశ్‌

విశాఖ - చెన్నై కారిడార్ పనులు ఇక వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఇందులో భాగమైన సామర్లకోట - రాజానగరం రోడ్డు వెడల్పు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా ఈ ప్రాజెక్టులో మారుస్తారు. 30 నెలల్లో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టుకు రూ. 300.28 కోట్లు ఖర్చవుతాయి. ఇందులో 78.5 శాతం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ నుంచి రుణంగా లభించగా 21.5 శాతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరిస్తుంది. ఈ రోడ్డు వెడల్పుకు మొత్తం 72.17 ఎకరాల భూమిని సేకరించి, రూ. 106.75 కోట్లు కేటాయించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇరువైపులా 4.5 మీటర్ల ఖాళీ ఉండే ఈ రహదారికి, అర్బన్ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లతోపాటు సర్వీసు రోడ్డు కూడా ఉంటాయి. రాజానగరంలో ఈ రోడ్డు జాతీయ రహదారికి అనుసంధానం కావడమే కాక, కాకినాడ పోర్టుకు కూడా మార్గం కానుంది.
రహదారి అభివృద్ధిలో భాగంగా మూడు చిన్న వంతెనలు, 75 కల్వర్టులు, రెండు ఫ్లైఓవర్లు, రెండు అండర్ బ్రిడ్జిలు నిర్మిస్తారు. ఈ రహదారితో ఈ ప్రాంతంలో పారిశ్రామిక వౌలిక సదుపాయాలకు ఊతం లభించడంతో సాంఘీక, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వ అంచనా.
ఈ క్రమంలో పెద్దాపురం, రంగంపేట, సూరంపాలెం, రాజానగరం చుట్టుపక్కల వెనుకబడిన ప్రాంతాలకు రోడ్డు అనుసంధానం కూడా పెరుగుతుంది.