ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని దోచేస్తున్న టీడీపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జనవరి 2: తెలుగుదేశం నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని, వారి అవినీతి, అక్రమాలకు అడ్డులేకుండా పోయిందని నెహ్రూ యువ కేంద్ర జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.విష్ణువర్థన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం అనంతపురం నగరంలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఏ విభాగం చూసినా అవినీతి పెరిగిపోయిందన్నారు. ఇందుకు సాక్షం విజయవాడ మేయర్ వ్యాఖ్యలేనన్నారు. విజయవాడలో ప్రభుత్వ భూములకు రాత్రికి రాత్రే జీవోలు పుట్టిస్తూ అక్రమిస్తున్నారని, ఎప్పుడూ జైలుకు వెళ్తామోనని భయంగా ఉందని, తనలాంటి నాయకులు టీడీపీలో ఉండలేరని బాధపడటం అందరూ గమనించాలన్నారు. రాష్ట్భ్రావృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ దేశ ప్రధాని నరేంద్రమోదీ నిధులు విడుదల చేస్తేంటే వాటితో రాష్ట్భ్రావృద్ధి చేయకుండా సొంత ఖాతాల్లోకి మార్చుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్భ్రావృద్ధిపై ప్రధాని మోదీని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలవడం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి దేశ ప్రధానిని చర్చకు పిలవడం వింత అన్నారు. ఇది బాబు అవివేకానికి అద్దం పడుతోందన్నారు. ముగ్గురు మోదీలతో నా పోరాటం అంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరి నాల్గవ మోదీ పవన్ కల్యాణ్ గురించి వ్యాఖ్యానించమంటే ఆయన మా వాడే అంటున్నాడన్నారు. టీడీపీ అతి పెద్ద దొంగల ముఠా పార్టీ అని పవన్ ఆరోపించారని, అయినా పవన్‌తో కలుస్తున్నారంటే దీనికి మీరే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రధాని వస్తున్నారంటే టీడీపీ వారికి వెన్నులో వణుకు పుడుతోందన్నారు. ప్రధాని ఎక్కడ తమ బండారం బయటపెడతారన్న భయం టీడీపీ నేతలకు పట్టుకుందన్నారు. అందుకే మోదీని అడ్డుకుంటామని ప్రకటనలిస్తున్నారన్నారు. ఈ నెలలోపు రాయలసీమ జిల్లాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పర్యటన ఉంటుందన్నారు. టీడీపీ వారికి దమ్ముంటే షా పర్యటనను అడ్డుకోవాలని ఛాలెంజ్ విసిరారు.
రాష్ట్రంలో ప్రజలు కట్టిన పన్నులతో టీడీపీ ప్రభుత్వం సిగ్గులేకుండా పత్రికా ప్రకటనలిచ్చుకుంటూ మోదీని తిడుతోందన్నారు. ఇదేనా మీ స్థాయి అని నిలదీశారు. మీరు చెప్పిన మాటలు ఎవరూ నమ్మరు కాబట్టే ఇలా ప్రకటనలు, పత్రికల్లో డప్పుకొట్టుకుంటున్నారని ఆరోపించారు. జన్మభూమి కార్యక్రమం ద్వారా నాలుగు సంవత్సరాల్లో ఏం సాధించారని విష్ణు నిలదీశారు. ఐదు విడతలుగా జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తే లక్షల కొద్దీ వినతులు వచ్చాయని, అవన్నీ ఆయా జిల్లాల కలెక్టరేట్లలో మూలుగుతున్నాయన్నారు. అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నాయకులు జేబులు నింపుకోవడానికే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తప్ప ప్రజల కోసం కాదన్నారు. అవినీతికి పాల్పడుతున్న టీడీపీ నేతలను అరెస్టు చేస్తే దేశంలోని జైళ్లు చాలవని అన్నారు. ప్రజాసామ్య వ్యవస్థను నాశం చేయడంలో టీడీపీ ప్రభుత్వం ముందుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, టీడీపీ నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. సామాన్య ప్రజల ఇబ్బందులు, సమస్యలు తీర్చడానికి ప్రయత్నించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విష్ణు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎంఎస్.పార్థసారథి, జిల్లా అధ్యక్షుడు అంకాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.