ఆంధ్రప్రదేశ్‌

గృహ నిర్మాణ ప్రాజెక్టులు గడువులోగా పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 2: రాష్ట్రంలోని గృహ నిర్మాణ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఏపీటిడ్కో (ఏపీ టౌన్‌షిప్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) అనిల్ చంద్ర పుణేఠా ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో ఏపీటిడ్కోకు సంబంధించి రాష్ట్ర స్థాయి మంజూరు, పర్యవేక్షణ కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ ప్రాజెక్టులు అన్నిటినీ సకాలంలో పూర్తి చేసేందుకు వీలుగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణానికి సంబంధించి రెండు దశల ప్రాజెక్టుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదటి దశ పనులను రానున్న నాలుగు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఈ గృహాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీటిడ్కో ఎండీ బిఎం దివాన్ మాట్లాడుతూ వివిధ పట్టణాల్లో 5.79 లక్షల ఇళ్లు మంజూరు కాగా, వాటిలో 4.60 లక్షల ఇళ్లకు టెండర్లు ఖరారు చేశామన్నారు. వాటిలో 3.6 లక్షల ఇళ్లు ప్రారంభమైనాయన్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ కింద 4.28 లక్షల ఇళ్లు మంజారు కాగా, 1.69 ఇళ్లకు పాలనా ఆమోదం మంజూరైందన్నారు. వీటిలో 71 వేల ఇళ్లు పూర్తి అయ్యాయన్నారు. మొదటి దశ పనులను మార్చిలోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 11 అర్బన్ లోకల్ బాడీస్, 5 అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల నుంచి 41 డీపీఆర్‌లు వచ్చాయన్నారు. వాటి ద్వారా 57 వేల ఇళ్లను నిర్మించాల్సి ఉంటుందన్నారు. ఈ ఇళ్ల నిర్మాణానికి 3,183 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని, ఇందులో కేంద్రం నుంచి 861 కోట్ల రూపాయలు సమకూర్చుకుంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం 676 కోట్ల రూపాయలు, లబ్ధిదారులు 1191 కోట్ల రూపాయలు భరించాల్సి ఉంటుందని వివరించారు.
చిత్రం..గృహ నిర్మాణంపై సమీక్షిస్తున్న దృశ్యం