ఆంధ్రప్రదేశ్‌

మోదీజీ.. మా సీఎం సవాల్ స్వీకరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, జనవరి 2: ఎవరూ చేయనంతగా ఏపీకి ఎన్నో అభివృద్ధి-సంక్షేమ పథకాలు అందించామంటున్న ప్రధాని మంత్రి నరేంద్రమోదీ ప్రసంగంపై చర్చకు రావాలన్న ముఖ్యమంత్రి సవాల్‌ను స్వీకరించాలంటూ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేసారు. ఐదు కోట్ల ఆంధ్రుల హక్కుల కోసం బాబు చేస్తున్న ధర్మపోరాటానికి విజ్ఞతతో ఆలోచించి ప్రజలంతా సహకరించాలని కోరారు. బుధవారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ఆరోవిడత జన్మభూమి-మా వార్డు మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నాలుగున్నరేళ్ళుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్థికంగా ఎన్ని ఆటుపోట్లున్నా మంచి పాలన అందించారన్నారు. కేంద్రాన్ని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, విభజన చట్టం, రాజ్యసభలో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామన్నారు.ఏపీకి రూ. 16,000 కోట్లు లోటు బడ్జెట్ అంటూ చెప్పిన కేంద్రప్రభుత్వమే రూ. 3,900 కోట్లు ఇచ్చిందన్నారు. రాజధాని లేక, ఎక్కడ కట్టాలో తెలియక ఆర్థిక నగరంగా తయారు చేయాలంటూనే ఢిల్లీని తలదనే్నలా నిర్మించాలన్న మోదీయే అందుకు కావల్సిన నిధులు రూ. 4,900 కోట్లకు కేవలం రూ. 1500 కోట్లు ఇచ్చారన్నారు. రాజధాని నిర్మాణ పనుల్లో అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులకే ఆ మొత్తం సరిపోదని అచ్చెన్న అన్నారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం నీతి ఆయోగ్ సూచనల మేరకు రాష్ట్రానికే ఆ ప్రాజెక్టు పనులు అప్పగించి నిధులు ఇవ్వకుండా ఇప్పటికీ అష్టకష్టాలు పెడుతోందన్నారు. ఇప్పటి వరకూ జరిగిన 75 శాతం పనులకు రూ. 5000 కోట్లు కేంద్రం ఇంకా ఇవ్వాల్సివుందన్నారు. ఎంతో ఖనిజసంపద ఉందని చెప్పి కడపలో స్టీల్ ప్లాంటు నిర్మాణానికి అంగీకరించిన కేంద్రం మాటమార్చడంతో అక్కడ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావల్సివచ్చిందన్నారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామంటూ ఒకరోజు, ఇవ్వలేమంటూ మరోరోజు మాటలు చెప్పే కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి 11 సంస్థలు కేటాయించాలంటూ విభజన చట్టంలో ఉన్నప్పటికీ వాటిని అమలుచేయకపోవడం వల్లే ధర్మ పోరాటానికి ముఖ్యమంత్రి దిగాల్సి వచ్చిందన్నారు. నాలుగున్నరేళ్ళుగా రాష్ట్రంలో పేదోడి స్వగృహం కల నెరవేర్చడానికి 30 లక్షల మందికి గృహాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలు అడుగడుగునా అడ్డుపడుతున్నా, ఆర్థికంగా ఈ రాష్ట్రానికి అనేక సమస్యలు ఉన్నా, ఎక్కడా సంక్షేమ పథకాలను అమలు చేయడమన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలపై చర్చ జరగాలని, సీఎం విడుదల చేసిన శే్వతపత్రాలపై గ్రామస్థాయిల్లో కూడా చర్చ జరిగినప్పుడే కేంద్రం చేసిన దగా ప్రతీ పౌరుడికీ అర్థమవుతుందన్నారు. 2014 ముందు మనకు ఇష్టం లేకపోయినా, మనం కోరుకోపోయినా రాష్ట్రాన్ని రెండుగా విభజించారని, విభజన జరిగినప్పటికీ, ఆంధ్రాకు జరిగిన అన్యాయాన్ని కేంద్రప్రభుత్వం సరిచేస్తుందన్న నమ్మకంతోనే వారితో జతకట్టి ఎన్నికల్లోకి వెళ్ళి ప్రభుత్వాలను ఏర్పాటు చేసామన్నారు. కానీ, వారే మోసం చేయడంతో ధర్మపోరాటం చేస్తున్నామన్నారు. ఐదుకోట్లు ఆంధ్రుల హక్కులను అడిగేందుకు మరో అవకాశం లేకపోగా మరో పార్టీతో జతకట్టి ప్రాంతీయ పార్టీలను ఒక తాటిమీదకు తీసుకువస్తున్న ముఖ్యమంత్రిపై కేంద్రం కనె్నర్ర చేస్తే భయపడేది లేదంటూ హెచ్చరించారు. స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, కలెక్టర్ కె.ధనంజయరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..జన్మభూమి సభలో మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు