ఆంధ్రప్రదేశ్‌

వైకాపాను బంగాళాఖాతంలో కలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 3: బీసీ కులాలన్ని ఏకతాటిపై తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి వైకాపాను బంగాళాఖాతంలో కలపాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నెల్లూరులో గురువారం రూ.4.5కోట్లతో నిర్మిస్తున్న బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్‌ను నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. అయితే ఎన్‌టీ రామారావు టీడీపీ స్థాపించిన తర్వాతనే బడుగు, బలహీన వర్గాల వారికి రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించిందని స్పష్టం చేశారు. టీడీపీ బలహీన వర్గాల కోసమే పుట్టిందని, 36 ఏళ్ల టీడీపీ సుదీర్ఘ ప్రయాణంలో బలహీన వర్గాలు పార్టీకి అండగా ఉన్నారని తెలిపారు. సాధికారత సర్వేలో రాష్ట్రంలోనే 13 జిల్లాల్లో 49.9శాతం బలహీన వర్గాల ప్రజలున్నట్లు వెల్లడైందన్నారు. వీరి అభ్యున్నతికి ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల నేపథ్యంలో బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి వై ఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీ డిక్లరేషన్‌ను ఎందుకు పక్కన పెట్టారని ప్రశ్నించారు. హాస్టళ్లలో వౌలిక వసతులు, మెస్ చార్జీలు పెంచిన ఘనత కూడా చంద్రబాబునాయుడికే దక్కుతుందని కొనియాడారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాల ఉండే విధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావం నుండి బీసీలు అండగా నిలిచారని గుర్తుచేశారు. బీసీ సబ్‌ప్లాన్ కోసం తమ ప్రభుత్వం ఇప్పటివరకూ రూ.12వేల కోట్లు ఖర్చుపెట్టినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామనే అక్కసుతో మ్యాచింగ్ నిధులను నిలిపివేశారని కేంద్రంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాను వ్యతిరేకించి ఇపుడు ప్రేమ ఒలకబోస్తే రాష్ట్ర ప్రజలు నమ్మేందుకు సిద్ధంగా లేరన్నారు. పురపాలక మంత్రి నారాయణ మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. క్యాబినెట్‌లో ఎనిమిది మంది బీసీ మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. దేశంలోనే బీసీల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్, కలెక్టర్ రేవు ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.