ఆంధ్రప్రదేశ్‌

జిల్లాలకు పరిపాలనా న్యాయమూర్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), జనవరి 3: ప్రత్యేక హైకోర్టు ప్రారంభమైన నేపథ్యంలో 13 జిల్లాలకు పరిపాలనా న్యాయమూర్తులను నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగారి ప్రవీణ్‌కుమార్ కృష్ణా పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తారు. గుంటూరుకు జస్టిస్ ఏవి శేషసాయి, విశాఖపట్నంకు జస్టిస్ ఎస్‌వి భట్, తూర్పు గోదావరి జిల్లాకు జస్టిస్ మాందాత సీతారామమూర్తి, చిత్తూరుకు జస్టిస్ యు దుర్గాప్రసాదరావు, పశ్చిమ గోదావరి జిల్లాకు జస్టిస్ టి సునీల్‌చౌదరి, కర్నూలుకు జస్టిస్ ఎం సత్యనారాయణమూర్తి, అనంతపురానికి జస్టిస్ గుడిసేవ శ్యామ్‌ప్రసాద్, నెల్లూరు జిల్లాకు జస్టిస్ జె ఉమాదేవి, ప్రకాశం జిల్లాకు జస్టిస్ నక్కా బాలయోగి, కడప జిల్లాకు జస్టిస్ తేలప్రోలు రజని, శ్రీకాకుళం జిల్లాకు జస్టిస్ డివిఎస్‌ఎస్ సోమయాజులు, విజయనగరం జిల్లాకు జస్టిస్ కొంగర విజయలక్ష్మి, ఇన్‌ఛార్జి న్యాయమూర్తులుగా ఆయా జిల్లాల పరిపాలనా బాధ్యతలను నిర్వర్తిస్తారు.