ఆంధ్రప్రదేశ్‌

పాలకుల హామీలను ప్రజలు నమ్మరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జనవరి 12: రానున్న ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి పాలకులు అప్పుడే హామీలు ప్రకటిస్తున్నారని, అయితే వాటిని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిన్న వర్తకులకు రూ.40 లక్షల వరకు జీఎస్టీ ఉండదని చెప్పడం వారి ఓట్లు దండుకోవడానికేనన్నారు. అదే విధంగా ఈనెల నుంచే రూ.2 వేల పెన్షన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పడం ఓట్ల కోసమేనన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఎంపీ స్థానాలకు పోటీ చేయకుండా కేవలం అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి బీజేపీ మోసం చేసిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ ఇతర దేశాల పర్యటనలో చెప్పడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రానికి హోదా తెచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్, తన స్వంత గ్రామం నీలకంఠాపురంలో అడుగుపెట్టేది లేదన్నారు. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ఎన్నికల కోసం అనేక హామీలు ఇస్తున్నాయని, వాటిని అమలు చేయడానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. కనీసం ఆ నిధులు విడుదల కావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు.