ఆంధ్రప్రదేశ్‌

శృంగేరి పీఠాధిపతిని సందర్శించిన కోడెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు బుధవారం నాడు శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి ఆశీర్వచనాలు అందుకున్నారు. మంగళవారం నాడు హైదరాబాద్ నుండి శృంగేరీ వెళ్లిన సభాపతి బుధవారం ఉదయం అక్కడ స్వామి వారిని కలుసుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్భుత శైవ క్షేత్రంగా కోటప్పకొండను అభివృద్ధి చేస్తున్న క్రమాన్ని డాక్టర్ కోడెల పీఠాధిపతికి వివరించారు. ఇప్పటికే పూర్తి చేసిన అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ గురించి వివరించగా స్వామీజీ ప్రత్యేకంగా అనుగ్రహ భాషణం చేశారు. ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా రూపొందించే క్రమంలో చేపట్టిన మార్పులను సభాపతి వివరించారు.
కోటప్పకొండను సందర్శించాలని సభాపతి స్వామివారిని విన్నవించగా, త్వరలో వస్తానని పీఠాధిపతి చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు శుభాశీస్సులు అందించిన స్వామీజీ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని అన్నారు. నిరంతర దీక్షతో పనిచేసే నాయకుని నేతృత్వంవల్లే ఇది సాధ్యం కానుందని స్వామీజీ పేర్కొన్నారు. ఆగస్టు 12 నుండి ప్రారంభం కానున్న కృష్ణవేణి పుష్కరాలను ప్రభుత్వం పెద్దఎత్తున నిర్వహిస్తున్న విషయాన్ని సభాపతి వివరించారు. పుష్కరవేళ కృష్ణమ్మ చెంత నదీ స్నానం ఆచరించాలని విన్నవించగా స్వామీజీ అంగీకరించారు.

మైనారిటీలకూ సివిల్స్ కోచింగ్
ఢిల్లీ తరహాలో సెంటర్లు
అసెంబ్లీ మైనారిటీ కమిటీ సిఫార్సు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: మైనారిటీ విద్యార్థులకు సివిల్స్‌లో కోచింగ్ ఇప్పించేందుకు ఢిల్లీ తరహాలో చర్యలు చేపట్టాలని అసెంబ్లీ మైనారిటీ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మైనారిటీ కమిటీ చైర్మన్ షకీల్ అధ్యక్షతన బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మజ్లిస్ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్సీలు ఫారూఖ్ హుస్సేన్, సలీం, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం కమిటీ చైర్మన్ షకీల్ మీడియాతో మాట్లాడుతూ మైనారిటీ విద్యార్థులు సివిల్స్ పరీక్షకు హాజరయ్యేలా ఢిల్లీలో హందర్థ్ కోచింగ్ సెంటర్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తున్నట్లు తెలంగాణలోనూ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీనిపై అధ్యయనం చేసేందుకు తాము వచ్చే నెల 9న ఢిల్లీ వెళ్ళనున్నట్లు ఆయన తెలిపారు. అజ్మీర్‌లో అతిథిగృహం నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని లోగడ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని ఆయన ప్రస్తావిస్తూ ఇందుకు స్థలం సేకరణకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.