ఆంధ్రప్రదేశ్‌

పలువురు ఐపిఎస్‌లకు పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జనవరి 18: రాష్ట్రంలో ఎనిమిది మంది ఐపిఎస్‌లకు పదోన్నతులు లభించాయి. పలువురు ఐజిలకు అదనపు డీజీలుగా.. అదేవిధంగా ఎస్పీలకు డిఐజిలుగా ప్రమోషన్ రావడంతో వారిని ప్రస్తుత స్ధానం నుంచి మరోచోటికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా పదోన్నతులు పొందిన ఐపిఎస్ అధికారులు డీజీపీ ఆర్‌పి ఠాకూర్ నేతృత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసి శుక్రవారం కృతజ్ఞతలు తెలియచేశారు. రాష్ట్ర శాంతి భద్రతల ఐజిగా పని చేస్తున్న రవిశంకర్ అదనపు డీజీగా పదోన్నతి లభించడంతో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఇక్కడ పని చేస్తున్న హరీష్‌కుమార్ గుప్తాకు స్ధానచలనం కలిగింది. ఆర్గనైజేషన్ అండ్ కో ఆర్డినేషన్ ఐజిగా ఉన్న కుమార్ విశ్వజిత్‌కు అదనపు డీజీగా పదోన్నతి లభించింది. ఇక్కడే అడిషనల్ డీజీగా కొనసాగించడంతోపాటు స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర శాంతి భద్రతల ఐజి డాక్టర్ ఎ రవిశంకర్‌కు అదనపు డీజీగా పదోన్నతి లభించగా లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా నియమితులయ్యారు. ప్రస్తుతం లా అండ్ ఆర్డర్ అదనపు డీజీగా కొనసాగుతున్న హరీష్‌కుమార్ గుప్తాను ప్రొవిజినింగ్ అండ్ లాజిస్టిక్స్ అదనపు డీజీగా బదిలీ చేశారు. అదేవిధంగా ఐజి క్యాడర్‌లో రవాణాశాఖ కమిషనర్‌గా పని చేస్తున్న ఎన్ బాలసుబ్రహ్మణ్యంకు అదనపు డీజీగా పదోన్నతి లభించగా ఆయన్ను ఇక్కడే కొసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా హోంగార్డ్సు ఐజి కొనసాగుతున్న కృపానంద్ త్రిపాఠికి అదనపు డీజీగా పదోన్నతి లభించింది. ఇదిలావుండగా.. గ్రే హౌండ్స్ డిఐజి వినీత్ బ్రిజాల్‌కు ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా పదోన్నతి లభించగా ఇక్కడే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా విజయనగరం ఎస్పీ జి పాలరాజుకు డిఐజిగా పదోన్నతి లభించింది. ఈయన్ను విశాఖ రేంజ్ డిఐజిగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న సిహెచ్ శ్రీకాంత్‌ను పోలీసు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని టెక్నికల్ సర్వీసెస్ విభాగం డిఐజిగా బదిలీ చేశారు. శ్రీకాకుళం ఎస్పీ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మకు డీఐజిగా పదోన్నతి లభించగా ఈయన్ను ఏలూరు రేంజ్ డిఐజిగా నియమించారు. కాగా ప్రస్తుతం ఏలూరు రేంజ్ డిఐజిగా పని చేస్తున్న టి రవికుమార్ మూర్తి జనవరి 31వ తేదీతో పదవి విరమణ చేయనున్నారు. ఈయన రిటైరయిన అనంతరం త్రివిక్రమ వర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలావుండగా.. డిప్యూటేషన్‌పై కేరళ క్యాడర్‌లో పని చేస్తున్న ఐపిఎస్ అధికారి ఎస్ శ్యామ్ సుందర్‌కు డిఐజిగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.