ఆంధ్రప్రదేశ్‌

భాష మనుగడకు సాహితీ సంస్థలు ఉద్యమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 20: తెలుగుభాష మనుగడకు సాహితీ సంస్థలు ఉద్యమించాలని రాష్ట్ర ఉప శాసనసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. బుధవారం ఎస్వీ ఆర్ట్స్ బ్లాక్‌లో శంకరంబాడి సుందరాచారి పీఠాన్ని ఆయన ప్రారంభించారు. శంకరంబాడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం శంకరంబాడి సాహితీ పీఠం, సిపి బ్రౌన్ సేవా సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలుగు సాంస్కృతిక యాత్ర సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ఒకే ఒక గీతంతో తెలుగుజాతి మదిలో నిలిచిన మహావ్యక్తి శంకరంబాడి అని, ఆయన పేరుతో సాహితీ పీఠాన్ని ఏర్పాటుచేయడం ఆనందదాయకమని అన్నారు. రాజకీయాలను శాసించే దిశగా తెలుగు భాషోద్యమం జరగాలన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు అక్షరాలు నేర్వని జాతి తరగతి గదుల్లో తయారవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమావేశానికి సభాధ్యక్షులు, శంకరంబాడి సాహితీపీఠం గౌరవ అధ్యక్షుడు గార్లపాటి దామోదర నాయుడు, ఓలేటి పార్వతీశం మాట్లాడుతూ తెలుగు భాషకు సమగ్ర నిఘంటువును తయారుచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల భాషలోనే పరిపాలన సాగిస్తూ అన్ని ప్రభుత్వ శాఖలలో తెలుగు నిర్భందం చేసేలా ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఎమ్సెట్ లీకేజీపై సిఐడి దర్యాప్తు

డిజిపికి ఫిర్యాదు చేసిన కన్వీనర్
రంగంలోకి దిగిన పోలీసులు
అదుపులో ఐదుగురు విద్యార్థులు
విజయవాడలోనూ దర్యాప్తు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 20: తెలంగాణ ఎమ్సెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. తాజాగా ఈ వ్యవహారంపై కన్వీనర్ డాక్టర్ ఎన్‌వి రమణారావు చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ అనురాగ్ శర్మ బుధవారం సిఐడి దర్యాప్తుకు ఆదేశించారు. ఎమ్సెట్ ప్రశ్నాపత్రం లీకైందని, విద్యార్థులు అక్రమంగా ర్యాంకులు పొందారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణారావు డిజిపి అనురాగ్ శర్మను కలిసి మీడియా కథనాల్లోని అంశాలపై విచారణ జరిపించాలని కోరారు. దీంతో ప్రాథమిక విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సిఐడిని ఆదేశించినట్టు డిజిపి అనురాగ్ శర్మ తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై జెఎన్‌టియు కూడా అంతర్గత విచారణ జరుపుతోంది.
డిజిపి ఆదేశాలు అందుకున్న మరుక్షణం పోలీసులు ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. మూడు పోలీసు బృందాలు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించాయి. ఒక బృందం విజయవాడ వెళ్లగా, మరో రెండు బృందాలు వరంగల్‌లోనూ, రంగారెడ్డి జిల్లాలోనూ దర్యాప్తు ప్రారంభించాయి.
పరీక్ష నిర్వహణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ప్రచారం చేస్తున్నారని, పేపర్ లీక్ కాలేదని, కావాలనే కొంతమంది ప్రభుత్వంపై బురద జల్లేందుకు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తంకాగా, వాస్తవాలను తేల్చాలంటే దర్యాప్తు అవసరమని ఎమ్సెట్ కమిటీ అభిప్రాయపడింది. ఎమ్సెట్ పేపర్ లీక్ అంశంపై అవసరమైతే సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొనడంతోపాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడంతో అధికారులు ఫిర్యాదు చేయకతప్పలేదు. మరోపక్క విద్యార్థి సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. బుధవారం నాడూ జెఎన్‌టియు ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించాయి. ఎఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, టిఎన్‌ఎస్‌ఎఫ్, ఎన్‌ఎస్‌యుఐ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఎమ్సెట్ పేపర్ లీక్‌చేసి పేద విద్యార్థులకు అన్యాయం చేశారని, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని అన్నారు. ఎంసెట్ కన్వీనర్‌ను అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బైపిసి సీట్ల కేటాయింపు
రాష్ట్రంలోని 116 విద్యాసంస్థల్లోని 2609 సీట్లకు టిఎస్ ఎమ్సెట్ బైపిసి విద్యార్ధులతో నిర్వహించిన అడ్మిషన్ల కౌనె్సలింగ్‌లో మొత్తం సీట్లను భర్తీ చేసినట్టు సెట్ కన్వీనర్ డాక్టర్ ఎంవి రెడ్డి చెప్పారు. బి-్ఫర్మసీ 2204 సీట్లు, ఫార్మా-డి ద్వారా 363 సీట్లు, బయో టెక్నాలజీ ద్వారా 42 సీట్లు భర్తీ చేసినట్టు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్ధులు ఈ నెల 26వ తేదీన రిపోర్టు చేయాలని చెప్పారు.