ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమలు తరలించుకుపోతుంటే నోరు మెదపరేం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 22: ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచి, ప్రపంచ దేశాలను ఆకర్షిస్తుంటే మన డేటాను కాపీ చేసి, ఫోన్‌లను ట్యాంపరింగ్ చేసి రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను తెలంగాణకు తరలించుకు పోతుంటే ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి చీమకుట్టినట్టైనా లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలికి బలపం కట్టుకుని దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పరిశ్రమలను తెస్తుంటే, జగన్ మాత్రం వాటిని వెనక్కు పంపే ప్రయత్నం చేయడం దారుణం కాదా అంటూ నిలదీశారు. మంగళవారం ఈ మేరకు జగన్‌కు రాసిన బహిరంగ లేఖను మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విడుదల చేశారు. వైజాగ్‌లో పారిశ్రామిక సదస్సును అడ్డుకునేలా మీరు కుట్రలు పన్నిన మాట వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. సింగిల్ విండో ద్వారా 14 రోజుల్లో అనుమతులు ఇవ్వడంతో పాటు అనేక పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నారని, దేశంలో తయారయ్యే ప్రతి ఐదు ఫోన్‌లలో రెండు ఫోన్‌లు ఏపీ నుంచి తయారవుతున్నాయంటే అది చంద్రబాబు కృషికి నిదర్శనమన్నారు. రాష్ట్రంలో దాదాపు 50 ఏళ్లకు రావాల్సిన పరిశ్రమలు కేవలం నాలుగున్నరేళ్లలో రప్పించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. 2013-14లో పారిశ్రామిక ప్రగతి జాతీయ స్థాయిలో 17.9గా ఉంటే ఏపీలో మాత్రం మైనస్ 4గా ఉందన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత పారిశ్రామిక ప్రగతి జాతీయ స్థాయిలో 7.1 ఉంటే ఏపీలో 9.52 శాతం సాధించడం వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు.
నాలుగేళ్లలో మూడు పారిశ్రామిక సదస్సులను ఏర్పాటుచేసి రూ.15.45 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు, 2622 భారీ, మెగా ప్రాజెక్టు నుంచి ప్రతిపాదనలు వచ్చాయని పేర్కొన్నారు. అందులో ఇప్పటివరకు 210 ప్రాజెక్టులు, రూ.1.77 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఉత్పత్తిని ప్రారంభించాయని, అవి మీకు కన్పించడం లేదా అంటూ నిలదీశారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్ రాష్ట్రానికి పరిశ్రమలు రావడంలో ఏనాడైనా ప్రభుత్వానికి కనీసం ఒక్క సలహాఅయినా ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని బొగ్గు నిల్వలను తెలంగాణకు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యంపై కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. మీ రాజకీయ లబ్ధికోసం రాష్ట్రాన్ని వంచిస్తున్న మోదీ, కేసీఆర్‌లతో కలిసి కుట్రలు పన్నడం సిగ్గుచేటని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే ప్రజలు మళ్లీ మీరే రావాలంటూ నినదిస్తున్నారని మంత్రి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు.పట్టిందని కొనియాడారు. మాజీ మంత్రి, బీజేపీ నేత మాణిక్యాలరావు దొంగ దీక్షలు చేయటం కాదని, ధైర్యం ఉంటే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో తేల్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి అబద్దపు ప్రచారానికి పరిమితం అయ్యారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమర్ధుడైన నేత అయినందువల్లే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోందని ఆయన కొనియాడారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీలో చేరేందుకు సిద్ధమై బీజేపీలోకి వచ్చారన్నారు. అందులో భాగంగానే వైసీపీ అజెండాను బీజేపీ అజెండాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని జవహర్ మండిపడ్డారు. తెలంగాణ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌పై ఆయన తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తలసాని అంత దద్దమ్మ లేడని గతంలో కేసీఆరే అన్నారని ఆయన గుర్తుచేశారు. సమర్ధులైన బీసీ నాయకులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని, తెలంగాణాలో దద్దమ్మలను వదిలేసి దమ్ముగల నాయకులంతా నూతన ఆంధ్రప్రదేశ్‌లోకి వచ్చామని ఆయన తెలిపారు.