ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఇంటిలిజెన్స్ నిఘా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూలై 21: ఎర్రచందనం దుంగలు వేలం నోటిఫికేషన్ జారీ నేపధ్యంలో స్మగ్లర్లు, కాంట్రాక్టర్ల సిండికేట్‌పై ఇంటలిజెన్స్‌వర్గాలు నిఘా పెట్టినట్లు సమాచారం. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో స్మగ్లర్లతో కాంట్రాక్టర్లు కుమ్మకు కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శేషాచలం అడవుల నుంచి స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తుండగా పట్టుకున్న నాలుగున్నర వేల టన్నుల ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు గోడౌన్లలో భద్రపరిచారు. గత ఏడాది ఎర్రచందనం విక్రయానికి బహిరంగ టెండర్ల పిలవగా స్మగ్లర్లు, కాంట్రాక్టర్లు సిండికేట్ కావడంతో రెండవ పర్యాయం వేలం పాటలకు ఏ ఒక్కరూ హాజరుకాలేదు. తాజాగా మూడువేల టన్నుల ఎర్రచందనం దుంగలు వేలం వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పివి రమేష్ జిల్లా అటవీశాఖ అధికారులను వేలం పాటలపై ఆరా తీశారు.