ఆంధ్రప్రదేశ్‌

అవరోధాలు సృష్టించొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 21: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులను ప్రజా సాధికార సర్వేలో ఎన్యూమలేటర్లుగా వినియోగించుకునే అంశాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్స్ సర్వే కార్యక్రమ పురోగతిని గురువారం ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్‌ఓలు పాల్గొన్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్డీఓ చేసిన సూచనను ముఖ్యమంత్రి స్వాగతిస్తూ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు పల్స్ సర్వే బృందాలకు శిక్షణనిస్తారని తెలిపారు. ఇందుకు ఒక కార్యక్రమం రూపొందించాల్సి ఉందని సిఎం చెప్పారు. ప్రజా సాధికార సర్వేను తాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పని చేస్తున్నానని, అధికారులు, సిబ్బంది కూడా బాధ్యతగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి జిల్లాకు జనాభా ప్రాతిపదికన 32 నుంచి 33,000 బృందాలు ప్రజా సాధికార సర్వే చేస్తున్నాయన్నారు. ప్రజాసాధికార సర్వే వేగం పుంజుకోవాలని, ఆషామాషీగా భావిస్తే కఠిన చర్యలకు వెనుకాడేది లేదని సిఎం తెలిపారు. సర్వర్ విఫలమయ్యింది లాంటి సాంకేతిక అంశాలను కారణంగా చెప్పి తప్పించుకోవాలని చూడవద్దని ముఖ్యమంత్రి అన్నారు. సేకరించే సమాచారంలో కచ్చితత్వం ఉండాలని, సమగ్రత ఉండాలని ఆయన సూచించారు. 5ల తేదీలోగా పెన్షన్లు ఇచ్చేవారికి పెన్షన్ సొమ్ము చెల్లించి, తిరిగి సిబ్బంది సమగ్ర సర్వేలో బిజి కావాలని, పై అధికారులు వేరే చెప్పినా వినకుండా సమగ్ర సర్వేకు కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు. సాంకేతిక సమస్యలు వస్తుంటాయి. అంతమాత్రం చేత సర్వేను పక్కన పెడితే సహించనని ముఖ్యమంత్రి తెలిపారు. వర్షాలు పడిన తర్వాత కూడా సమగ్ర సర్వే చేశామని, బుధవారం నాడు 3,42,751 గృహాల్లో 9,12,787 మంది నుంచి వివరాలు సేకరించామని తెలిపారు. కలెక్టర్ సహా ప్రతి ఒక్కరూ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావాల్సిందేనని, ఇందుకు మినహాయింపులేమీ లేవని ఆయన తెలిపారు. ఒక పర్యాయం చెప్పిన తర్వాత చేయాల్సిందేనని, ఇష్ట ప్రకారం వ్యవహరించవద్దని కోరారు. తాను పనిని ప్రేమిస్తానని, నిబద్దతను ఇష్టపడతానని ఆయన తెలిపారు.