ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర చేపగా పులస?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 21: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేపగా పులస చేపను ప్రకటించాలంటూ కొందరూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఇప్పటికే కొరమీను చేపను రాష్ట్ర చేపగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రుచికరమైన ఈ చేపను రాష్ట్ర చేపగా ప్రకటించాలని కోరుతున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చి (ఐసిఎఆర్) 2007 ఒక ప్రతిపాదన తెరమీదకు తీసుకువచ్చింది. చేపల పరిరక్షణ చర్యలో భాగంగా ఒక చేపను రాష్ట్ర చేపగా ప్రకటించాలని అన్ని రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొరమీను చేపను రాష్ట్ర చేపగా ప్రకటించారు. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం తమ రాష్ట్ర చేపగా కొరమీనును బుధవారం ప్రకటించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పులసను రాష్ట్ర చేపగా ప్రకటించాలని కొంతమంది నెటిజెన్లు పులస ఎపిస్టేట్ ఫిష్ పేరుతో ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్ ట్రెండ్స్‌లో ఇది చాలా సేపు ఎక్కువ మంది దృష్టిని ఈ ప్రచారం ఆకర్షించింది. పులస చేప రెండు తెలుగు రాష్ట్రాల్లో దొరుకుతుంది. హిల్సగా వ్యవహరించే మరో రకం పులస ఇతర కోస్తా రాష్ట్రాల్లో లభిస్తుంది. కానీ గోదావరి నదిలో దొరికే పులస ( శాస్ర్తియ నామం.. టెన్యులోసా ఇలిషా) చేప రుచి ప్రత్యేకమని చేపల ప్రియులు అంటున్నారు. సముద్రంలో ఉత్పత్తి అయ్యే ఈ చేప, వరదల సమయంలో గోదావరిలోకి ప్రవేశిస్తుంది. ప్రవాహానికి ఎదురీదడం దీని ప్రత్యేకత. గోదావరి నదిలో పట్టుకున్న పులస మాత్రమే చాలా రుచిగా ఉంటుంది. దీని ప్రత్యేక రుచి కారణంగా గోదావరి ప్రాంతాల ప్రజలు పులస కోసం ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు.