ఆంధ్రప్రదేశ్‌

ఢిల్లీలో బాబు దొంగ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటమి భయంతో ఢిల్లీలో దొంగ దీక్ష చేపట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. ప్రజల డబ్బును పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తున్నారని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. నాలుగున్నర ఏళ్ళలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు పలు పర్యాయాలు మాట మార్చారని ఆయన తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అంశంపై ఇప్పటికీ పోరాడుతున్నందుకే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందన్నారు. నిధుల విషయంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య నామమాత్రంగా విమర్శలు ఉంటున్నాయే తప్ప విచారణ ఎందుకు చేపట్టడం లేదని సజ్జల కేంద్రాన్ని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్రం ఎందుకు ఉదాసీనంగా ఉందో అర్థం కావడం లేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు కలిసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు. వారి మధ్య చీకటి ఒప్పందం ఉందన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.