ఆంధ్రప్రదేశ్‌

రేపు మంత్రివర్గ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కోడ్ అమలులోకి రానున్న నేపథ్యంలో వారంలోపే మరోసారి రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 13 సాయంత్రం 6 గంటలకు సచివాలయంలో ముఖ్యమం త్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసేంత వరకు కోడ్ అమలులో ఉండటంతో పాటు వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను తక్షణమే అమల్లోకి వచ్చేలా నిర్ణయాలు తీసుకుని ఆపై ఎన్నికలకు వెళ్లాలని సీఎం భావిస్తున్నారు. ఈనెల 8న జరిగిన సమావేశంలో ప్రకటించిన అన్నదాత- సుఖీభవ పథకానికి అవసరమైన మార్గదర్శకాలు తుదిరూపుకు వచ్చినట్లు సమాచారం.