ఆంధ్రప్రదేశ్‌

మోదీ విశాఖపట్నం పర్యటనను ప్రతిఘటిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 11: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను విస్మరించిన ప్రధాని నరేంద్ర మోదీకి తగిన గుణపాఠం చెబుతామని, మార్చి 1వ తేదీన ఆయన విశాఖ పర్యటనను వామపక్షాలు తీవ్రంగా ప్రతిఘటిస్తాయని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె రామకృష్ణ, పి మధు ప్రకటించారు. విజయవాడ దాసరిభవన్‌లో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రానికి మోదీ తీరని ద్రోహం చేశారని దుయ్యబట్టారు. ఈయన పర్యటనతో రాష్ట్భ్రావృద్ధికి ఏమైనా సానుకూల నిర్ణయాలుంటాయని ప్రజలు ఆశించి భంగపాటుకు గురయ్యారని అన్నారు. మోదీ పర్యటనను నిరసిస్తూ వామపక్షాలు గుంటూరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించామని చెప్పారు. ఈయన ఏ రాష్ట్రానికెళ్లినా అడుగడుగునా నిరసనలు వెల్లువెత్తుతున్నాయని ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాళ్, కేరళ, కర్నాటక తదితర రాష్ట్రాల్లో ప్రధాన పర్యటన్ని ప్రజలు ప్రతిఘటిన్నారని వివరించారు. 121 కోట్ల మంది ప్రజలకు ప్రధానిగా ఉన్న మోదీ... నిస్సిగ్గుగా తన స్థాయిని దిగజార్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేశారన్నారు. మార్చి 1వ తేదీన మోదీ విశాఖ పర్యటనపై ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యాన వామపక్షాలతో పాటు కలిసొచ్చే పార్టీలను కలుపుకుని పెద్దఎత్తున నిరసనలకు దిగుతామన్నారు. సీపీఐ,సీపీఎం రాష్టస్థ్రాయి సమావేశాల్లో భయానక కరువు, ఆర్థిక పరిస్థితులపై సమగ్రంగా చర్చించామన్నారు. ఆరు జిల్లాల్లో చరిత్రలో ఎన్నడూ లేనంతగా కరువు పరిస్థితులు దాపురించాయని వివరించారు. సీపీఐ, సీపీఎం, జనసేన ఆధ్వర్యంలో మంగళవారం అనంతపురంలో కరవు కేక పేరిట ఆందోళన నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రం పెద్దఎత్తున దెబ్బతినడానికి ప్రధాన కారణం... మోదీ... చంద్రబాబేనని దుయ్యబట్టారు. నాలుగున్నరేళ్లపాటు టీడీపీ, బీజేపీలు కల్సి పాలించి రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాయని విమర్శించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి రాజధాని నిర్మాణంతో పాటు విభజన హామీలను సాధించుకోవడంలో వెనుకబాటుకు గురయ్యాయని చెప్పారు. చంద్రబాబు ఢిల్లీ దీక్షకు సీపీఐ, సీపీఎం, రాష్ట్ర జాతీయ నేతలెవ్వరూ వెళ్లలేదన్నారు. రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా రాకపోవడానికి మోదీతో పాటు చంద్రబాబు ప్రధాన కారకులని విమర్శించారు.