ఆంధ్రప్రదేశ్‌

ప్రజల మధ్యే బీజేపీ కేడర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 11: భారతీయ జనతా పార్టీ కేడర్‌కు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఈ నెల 4వ తేదీన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పలాస నుంచి ప్రజా చైతన్య యాత్ర రథయాత్రను ప్రారంభించినప్పటి నుంచి ఈ కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ అమల్లో భాగంగా రాష్ట్రంలోని పార్టీ క్యాడర్ అంతా రోడెక్కింది. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసేంత వరకు ఈ క్యాడర్ అంతా ఓటర్ల మధ్యే గడుపుతుంది. ప్రతీ ఓటరు వద్దకు వెళ్ళి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అందించిన సహాయ సహకారాలను వివరిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి ఇచ్చిన వరాల గురించి ఏకరువు పెడతారు. ఇప్పటికే రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలో సుమారు 60 వేల మంది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 120కి పైగా సంక్షేమ పథకాల్లో లబ్ధిపొందివున్నారు. వీరిని ప్రత్యేకంగా కలుస్తారు. వారి వివరాలు ఇప్పటికే శక్తికేంద్రాల ప్రముఖ్‌లకు చేరాయి. వీరితో పాటు మిగిలిన ఓటర్లను నియోజకవర్గ పరిధిలోని క్యాడర్ కలుస్తోంది. ఇప్పటికే శక్తి కేంద్రాల ప్రముఖ్‌ల ద్వారా ఆలిండియా పార్టీ నిర్ధేశించిన విధంగా ఎన్నికల వ్యూహాలను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ వ్యూహాలను అమలుచేయడం ద్వారా అన్ని వర్గాల ఓటర్లను భారతీయ జనతా పార్టీ పోలింగ్ బూత్‌లకు తీసుకువెళుతుంది. అలాగే శక్తి కేంద్రాల్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని జాతీయ పార్టీ ఆదేశించింది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ సమర్పణ దివస్, గుంటూరు సభలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించినట్లుగా ఇళ్లకు బీజేపీ స్టిక్కర్లు అంటించడం, ఇంటి పైన పార్టీ జెండాలను ఎగరేయడం, పార్లమెంట్ స్ధాయి నేతలతో జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడటం తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 26న కమలం జ్యోతి దీపాన్ని వెలిగించి సంకల్పించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు.ఇక మార్చి 2వ తేదీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మోటారు సైకిల్ ర్యాలీలను ఏర్పాటుచేశారు. ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్ర మోదీ చివరి ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని శక్తి కేంద్రాల్లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటుచేయనున్నారు. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రథ యాత్రలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రానికి రానున్నారు. మరో వైపు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఆంధ్రాలో పర్యటించనున్నారు. అయితే ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కావాలి.