ఆంధ్రప్రదేశ్‌

ఆనందమయ నగరంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 13: ఉన్నత జీవన ప్రమాణాలు ఉండేలా ఆనందమయ నగరంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిర్మిస్తున్నామని, భవిష్యత్తులో స్మార్ట్ సిటీలకు నమూనా నగరంగా వెలుగొందుతున్నారు. ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజయవాడలో మూడు రోజుల పాటు జరుగునున్న సంతోష నగరాల సదస్సును ఆయన బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగపూర్‌ను మించిన నగరంగా అమరావతిని రూపొందిస్తామన్నారు. నాణ్యమైన జీవితం అందించేందుకు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మిస్తున్నామన్నారు. అమరావతిని గ్రీన్‌ఫీల్డ్ నగరంగా నిర్మిస్తున్నామన్నారు. సంతోష నగరాల్లో ఎలా జీవించాలో చర్చించేందుకు ఇక్కడ సమావేశమయ్యామన్నారు. ఆ సంతోషం భవిష్యత్తులో నిర్మించే నగర నిర్మాణంలో కనిపించేలా చూడాలన్నారు. సాంకేతికతను ఉపయోగించి ఏదైనా చేయవచ్చన్నారు. సాంకేతికతతో ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించవచ్చన్నారు. రాష్ట్ర విభజన వల్ల వచ్చిన కష్టాలను సంక్షోభంలో అవకాశాలుగా మార్చుకున్నామన్నారు. రాజధాని లేని నగరానికి భూ సమీకరణ చేశామని, 28 వేల రైతులు 34 వేల ఎకరాలు తనపై నమ్మకంతో ఇచ్చారన్నారు. ప్రపంచంలోనే సంతోష నగరాల జాబితాలో అమరావతిని నిలిపేందుకు పక్కా ప్రణాళికతో వెళ్తున్నామన్నారు. అమరావతి దేవతల రాజధాని అని, సింగపూర్‌ను మించిన నగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కృష్ణా నదిపై రెండు బ్యారేజీలు నిర్మిస్తున్నామని తెలిపారు. 100 నుంచి 120 కిలోమీటర్ల మేర కృష్ణా నది ఒడ్డున రాజధాని నిర్మిస్తున్నామని, ప్రపంచంలో ఇలాంటి నగరం ఎక్కడా ఉండబోదన్నారు. దేశంలో నిర్మించిన అనేక నగరాలు కేవలం పాలనా నగరాలుగా మిగిలిపోవడం వల్ల అవి ఘోస్ట్ నగరాలుగా మారాయన్నారు. రాత్రి అయ్యాక అక్కడ కార్యకలాపాలు ఉండవన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అమరావతిని ప్రజా రాజధానిగా నిర్మిస్తున్నామన్నారు. ఇందులో పేదలకు 50 వేల గృహాలను నిర్మిస్తున్నామన్నారు. రాజధానిలో 9 నగరాలు నిర్మిస్తున్నామన్నారు. కొత్త విషయాలకు అమరావతిని కేంద్రంగా చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నివాసానికి యోగ్యం కాని నగరాల్లో ఉంటున్నామని, వీటిని పునర్మించాల్సి ఉందన్నారు. ప్రజలు సంతోషంగా ఉండేలా కొత్త నగరాలను నిర్మించాల్సి ఉందన్నారు. వయాడక్ట్ మంత్రంతో నగరాలను నిర్మిస్తే, భవిష్యత్తులో నగరాలు మనగలుగుతాయన్నారు. నివాసం కోసం సౌకర్యాలే కాక అంతకుమించిన అంశాల్లో అమరావతి నివాసయోగ్యమైన నగరంగా మారుతుందన్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ విధానాన్ని అమరావతిలోని అన్ని భవనాలకు అమలు చేస్తామని, దీని వల్ల 30 శాతం వరకూ విద్యుత్‌ను పొదుపు చేయవచ్చన్నారు. అమరావతిలో 5 నుంచి 15 నిమిషాల్లోనే పని చేసే ప్రాంతానికి చేరేలా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. అమరావతికి అత్యున్నత విద్యా సంస్థలు, ఆసుపత్రులు, హోటళ్లు వస్తున్నాయన్నారు. డబ్బులు ఉన్నా అంతా సంతోషంగా ఉండాలని లేదన్నారు. నేరాలు, అవినీతి వంటివి ఇబ్బంది కల్గిస్తాయన్నారు.
అవినీతిని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వినియోగిస్తామన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అమరావతి నాలెడ్జి ఎకానమీగా మారుతుందన్నారు. అమరావతిని తీర్చిదిద్దడానకి సృజనాత్మక ఆలోచనలు, సలహాలను అందించాలన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.