ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రంపై కక్ష కట్టిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 19 : రాష్ట్రంపై కేంద్రం కక్ష కట్టిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రూ. 350 కోట్లు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకోవడం దారుణమని నరేంద్రమోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ఓ ఫంక్షన్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం కేఈ మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఎలాంటి సహాయం చేయకపోయినా సీఎం చంద్రబాబు ప్రజాసంకల్ప దీక్ష చేపట్టి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించేంత వరకూ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు మంచి పనులు చేసే టీడీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ వెళ్లి నిరాహార దీక్షలు చేసి సమస్యను భారత జాతి అంతా వినే విధంగా కృషి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. త్వరలో మహిళలకు స్మార్ట్ ఫోన్లు కూడా అందిస్తామన్నారు. సీఎం చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధి కోసం ఢిల్లీలో దీక్ష చేస్తే బీజేపీ నాయకులు విమర్శలు చేయడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీ నాయకులు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి వాస్తవాలు లేవన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి, ప్రత్యేక హోదా సాధించడానికి దేశంలో ఉన్న ఇతర పార్టీల నాయకులు కూడా సీఎం చంద్రబాబుకు మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.