రాష్ట్రీయం

ఎడమ కాల్వ ఎప్పటికయ్యేనో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 26: పోలవరం ఎడమ కాల్వ లక్ష్యం మేరకు పూర్తయ్యే పరిస్థితులు కన్పించడం లేదు. ఆగమేఘాలపై కుడికాల్వ పనులు పూర్తిచేసి, పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీళ్లు తరలిస్తున్నట్టుగానే ఎడమ గట్టుపై మరో ఎత్తిపోతల పథకం నిర్మించి, ఎడమ కాల్వ ద్వారా విశాఖకు నీళ్లు తరలించడానికి యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే పోలవరం ఎడమ కాల్వ పనులను పూర్తిచేయడానికి పలు ప్రతిబంధకాలు ఉన్నాయని అంటున్నారు. పదిచోట్ల 16వ నెంబర్ జాతీయ రహదారిని ఈ కాల్వను దాటిస్తూ తవ్వాల్సివుంది. ఈమేరకు జాతీయ రహదారి అధారిటీ నుంచి అనుమతులు తీసుకుని పదిచోట్ల వంతెనలు నిర్మించాల్సివుంది. ఒక చోట గెయిల్ పైపులైన్‌ను కూడా దాటి వెళ్తుంది. గెయిల్ అనుమతి తీసుకుని వంతెన నిర్మించాల్సివుంది. దీనికి తోడు రెండుచోట్ల రైల్వే లైనును కూడా ఈ కాల్వ తాకుతూ వెళ్తుంది కాబట్టి రైల్వే వంతెనలు కూడా నిర్మించాల్సివుంది. వీటి నిర్మాణానికి అనుమతులు రావాలంటే సవాలక్ష అడ్డంకులను దాటుకుంటూ వెళ్ళాల్సిందే. ఇది ఇప్పట్లో సాధ్యమయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఏలేరు రిజర్వాయర్‌కు పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించడానికి పట్టిసీమ తరహాలోనే తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం రామచంద్రపురం వద్ద పంపుహౌస్ ఏర్పాటుచేసి నీటిని పంపు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వరద కాలంలో రోజుకు 2000 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాల్వ ద్వారా ఏలేరు రిజర్వాయర్‌కు మళ్లిస్తారు.
ఏలేరు కాలువ నుండి ఇప్పటికే విశాఖ తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు ఐదు టిఎంసిల నీరు తరలిస్తున్నారు. దీనికి అదనంగా మరో ఏడు టిఎంసిలు తరలించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీనివల్ల ఏలేరు ఆయకట్టు స్థిరీకరణతోపాటు విశాఖ నగర తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవరాలను తీర్చనున్నారు. ప్రస్తుతం ఈ పథకానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు తయారుచేస్తున్నారు. కాగా పోలవరం ఎడమ కాలువ పనులు ఇప్పటికి 60 శాతం పూర్తయ్యాయి. ఈ కాలువ ప్రవాహ సామర్ధ్యం 765 క్యూసెక్కులుగా రూపొందించారు. ప్రస్తుతం విశాఖ నగరానికి ఏలేరు నుంచి 5 టిఎంసిలతో పాటు కాతేరు వద్ద విస్కో పైపులైన్ ద్వారా 150 క్యూసెక్కులు పంపిస్తున్నారు. ఈ నీటిని కూడా ఏలేరు ఎడమ కాల్వ ద్వారానే మళ్ళిస్తున్నారు. కొత్తగా ప్రభుత్వం భావిస్తున్నట్టు అదనపు నీరు పారించాలంటే పోలవరం ఎడమకాలువ మరో 69 కిలో మీటర్ల వరకు పనులు పూర్తిచేయాల్సివుంది. పోలవరం ఎడమ కాల్వ పనులను 2017 నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు సుమారు రూ.1401 కోట్లు ఖర్చుచేశారు. ఈ కాల్వ పనులు పూర్తికావాలంటే పది చోట్ల వంతెనలు, రెండు చోట్ల రైల్వే వంతెనలు, దాదాపు ఆరుచోట్ల అక్విడెక్టులు, అండర్ టనె్నళ్ళు వంటి కీలక నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. ఈ మొత్తం పనులు పూర్తయినపుడే ఎడమ కాల్వ నిర్మాణం పూర్తయ్యే అవకాశం వుంది. నిర్దేశించిన లక్ష్యం మేరకు పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదు కాబట్టే ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటుచేసి ఏలేరుకు అనుసంధానంచేసి, అక్కడ నుంచి విశాఖ అవసరాలకు నీటిని అందించడానికి చర్యలు చేపట్టారు.