తెలంగాణ

వౌలిక వసతులు అంతంతమాత్రం.. పుష్కర పాట్లు-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 26: కృష్ణా పుష్కరాల కోసం నల్లగొండ జిల్లా పరిధిలోని 28 పుష్కర ఘాట్‌లకు కోటిన్నర మంది భక్తుల వస్తారని అంచనా వేస్తున్న అధికార యంత్రాంగం వారికి అవసరమైన వౌలిక వసతుల కల్పనలో మాత్రం దారుణంగా వెనుకబడింది. తాగునీటి వసతి కోసం ఆర్‌డబ్ల్యుఎస్ శాఖకు 18.3 కోట్లు విడుదల చేశారు. ఈ నెల 28కల్లా పనులు పూర్తి చేయాల్సివున్నా ఘాట్‌లు, పార్కింగ్, హోల్డింగ్స్ పాయింట్ల వద్ద మంచినీటి వసతి చర్యలు 50 శాతం కూడా పూర్తికాలేదు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా తాగునీటిని అందించడం అనుమానంగానే ఉంది. వృద్ధులు, పిల్లలు, వికలాంగుల కోసం 2100 జల్లు స్నానాల యూనిట్లు ఏర్పాటు చేస్తుండగా వాటి పనులు ఇంకా మొదలుకాలేదు. ఘాట్‌ల వద్ద ట్యాంకులు, శుద్ధికేంద్రాలు, మోటార్లు, బోర్ల ఏర్పాటుకు 31 పనులకు 2.98 కోట్లు, 48 హోల్డింగ్స్ పాయింట్ల వద్ద తాగునీటి సరఫరాకు 4.50 కోట్లు వెచ్చిస్తున్నారు. భక్తులు అధికంగా వచ్చే వాడపల్లి పుష్కరఘాట్‌ల వద్ద మూడువేల లీటర్ల నీటి శుద్ధి కేంద్రాలు, కృష్ణానది నుండి నీటిని పంపింగ్ చేసేందుకు, కొత్తగా వేసిన ఐదు బోర్లకు మోటార్ల అనుసంధానం పనులు 50 శాతం కూడా పూర్తి కాలేదు. మఠంపల్లి క్షేత్ర ఘాట్‌ల వద్ద 90వేల లీటర్ల సామర్ధ్యం ట్యాంకు నిర్మాణం పనులు, ఇర్కిగూడెం, అడవిదేవులపల్లి, సాగర్ ఘాట్‌ల వద్ద నిర్మిస్తున్న ఓవర్‌హెడ్, జిఎల్‌ఎస్‌ఆర్ మంచినీటి ట్యాంకులు గడువులోగా పూర్తికావడం అసాధ్యంగా కనిపిస్తోంది. చందంపేట పెద్దమునిగాల, కాచరాజుపల్లి ఘాట్‌ల వద్ద బోర్లు వేసిన నీరు పడకపోవడంతో ఇక్కడ 1.20 కోట్లు ఖర్చు చేస్తున్నా తగిన తాగునీటి వసతి కల్పించలేని పరిస్థితి నెలకొంది. పిఏపల్లి అజ్మాపురం ఘాట్ వద్ద 37 లక్షలతో ఆర్‌వో ప్లాంట్ల ఏర్పాటు పనులు కూడా సగం వరకే వచ్చాయి. బుగ్గమాదారం, కిష్టాపురం, మహంకాళిగూడెం ఘాట్‌ల వద్ద తాగునీటి పనులు పురోగతిలో ఉన్నాయి.
పునాదుల దశలోనే మరుగుదొడ్లు
ఇక పుష్కర ఘాట్లు, పార్కింగ్, హోల్డింగ్స్ పాయింట్ల వద్ధ భక్తుల కోసం శాశ్వత, తాత్కాలిక పద్ధతిలో చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. 1,227 శాశ్వత మరుగుదొడ్ల వసతికి 1.85 కోట్లు, 1,073 తాత్కాలిక మరుగుదొడ్లకు 65 లక్షలు మంజూరు చేశారు. వాడపల్లి వద్ద 40 లక్షల భక్తుల రాక అంచనాతో 400 మరుగుదొడ్ల నిర్మాణం పనులు ఇప్పుడిప్పుడే ఆరంభించారు. మఠంపల్లిలో 200 మరుగుదొడ్ల నిర్మాణ పనులు పునాదుల దశలో ఉన్నాయి. మేళ్లచెర్వు, చందంపేట, సాగర్, పిఏపల్లి ఘాట్‌ల వద్ద, పార్కింగ్ ప్రాంతాల్లో నిర్మించాల్సిన పనులు కూడా ప్రాథమిక దశకే పరిమితం కాగా గుత్తేదారులు ముందుకు రాక అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాల్లో ఆపసోపాలు పడుతున్నారు. పలు ఘాట్‌ల వద్ద ఇప్పటికే ఉన్న పాతవాటికి మరమ్మతులు జరిపిస్తున్నారు. పారిశుద్ధ్య పనుల కోసం టెండర్లు పిలిచారు. ఇంకా సదరు పనులు మొదలుకాలేదు.
విద్యుత్ శాఖదీ అదే దారి..!
విద్యుత్ శాఖకు సంబంధించి 28 పుష్కరఘాట్‌లు, పార్కింగ్, హోల్డింగ్స్ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, లైట్లు, తాగునీరు, సిసికెమెరాల కనెక్షన్స్ వంటి వాటికి విద్యుత్ కనెక్షన్స్ కోసం 7 కోట్లతో పనులు జరుగుతున్నాయి. సదరు పనులు నత్తనడకన సాగుతున్నాయి. స్తంభాలు నాటిన చోట లైన్లు వేయలేదు. ట్రాన్స్‌ఫార్మర్లు వేసిన లైన్లకు అనుసంధానం చేయలేదు. ఏ ఘాట్, పార్కింగ్, హోల్డింగ్స్ పాయింట్ల వద్ద చూసినా విద్యుత్ శాఖ పనులు సగం దాకా కూడా రాకపోవడం ఉన్నతాధికారులను కంగారుపెడుతోంది.
సిద్ధంకాని పార్కింగ్ స్థలాలు
జిల్లాలో 28 పుష్కర ఘాట్‌ల వద్ద, వచ్చి వెళ్లే దారుల్లో 35చోట్ల పార్కింగ్, హోల్డింగ్స్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్, హోల్డింగ్స్ ప్రాంతాల పనులు అన్నిచోట్ల కూడా ఇంకా ప్రాథమిక దశలోనే ఉండటం సమస్యగా మారనుంది. అటవీశాఖ అనుమతులు అవరోధంగా మారాయి. ప్రతి ఘాట్ వద్ద పోలీస్ కంట్రోల్‌రూంలు, సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 5 కోట్ల వ్యయంతో సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తుండగా ఏడున్నర వేల మంది వివిధ హోదాల్లోని పోలీస్ సిబ్బంది బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు.

5లోగా పుష్కర
పనులు పూర్తికావాలి

దేవాలయాలకు కొత్త శోభ
మన్యంకొండకు రూ.10 లక్షలు నిధులు
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రకటన

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, జూలై 26: కృష్ణా పుష్కరాలతో కృష్ణానది తీరాన ఉన్న దేవాలయాలకు కొత్త శోభ తీసుకురావాలని, వేలాది మంది భక్తులు రానుండడంతో సౌకర్యాల ఏర్పాట్లలో అలసత్వం ఉండకూడదని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణానది తీరాన పలు పుష్కర ఘాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. బీచ్‌పల్లి సమీపంలోని పెబ్బేరు మండలం రంగాపూర్ పుష్కరఘాట్ దగ్గర ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణానదికి మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు పూజలు నిర్వహించారు. అనంతరం రాత్రి మహబూబ్‌నగర్‌లోని రెవెన్యూ మీటింగ్‌హాల్‌లో జిల్లా అధికారులతో కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ ఆగస్టు 5లోపు పుష్కర ఘాట్లకు సంబంధించిన పనులతో పాటు ఏర్పాట్లు కూడా పూర్తి కావాలని ఆదేశించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో 32 ప్రధాన ఘాట్లు ఉన్నాయని, మరో 20 లోకల్ ఘాట్లు కూడా ఉన్నాయని వీటన్నంటికీ ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. ఇదిలావుండగా, మన్యంకొండ దేవాలయానికి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. పుష్కరాల పనులకు నిధుల కొరత లేదనీ, నిధుల ఇబ్బందులు ఉన్నట్లయితే తక్షణమే ప్రణాళికలు పంపిస్తే నిధులు విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ శ్రీదేవి, జడ్పి చైర్మన్ బండారి భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రజా చైతన్యానికి పుష్కరాలు వేదిక

హెచ్‌ఓడిల సదస్సులో సిఎం చంద్రబాబు

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జూలై 26: ప్రకృతి ఆరాధనలో భాగంగా ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అన్వయిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృష్ణా పుష్కరాలను వేదికగా మలచుకోవాలని అవసరమైతే కేలండర్ ఆఫ్ ఈవెంట్స్ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. స్థానిక వెన్యూ వేదికలో మంగళవారం జరిగిన కార్యదర్శులు, శాఖాధిపతులతో నిర్వహించిన సమావేశంలో రానున్న పుష్కరాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. పుష్కరాల 12 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాలపై చర్చించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరుగుతున్న పుష్కర పనులపై పుష్కరాల స్పెషల్ ఆఫీసర్ బి రాజశేఖర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. గోదావరి పుష్కరాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం సూచించారు. మూడు జిల్లాల్లో తొమ్మిది కిలోమీటర్ల మేర ఘాట్లు నిర్మించామని చెప్పారు. విజయవాడ నగరంలోనే ఆరు కిలో మీటర్ల ఘాట్‌ల నిర్మాణం జరిగిందని సిఎం చెప్పారు. పుష్కరాల సందర్భంగా ఏయే రోజుల్లో అధిక రద్దీ ఉంటుందో గుర్తించి క్రౌడ్ మేనేజ్‌మెంట్ పద్ధతులను అవలంబించాలని సిఎం సూచించారు. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో లక్షకు పైబడి యాత్రికులు సందర్శించే ఎ-ప్లస్ ఘాట్‌లు 13 ఉన్నాయని స్పెషల్ ఆఫీసర్ రాజశేఖర్ చెప్పారు. మూడు జిల్లాల్లో 59 పుష్కర నగర్‌లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఃదుర్గాఘాట్ వద్ద మోడల్ గెస్ట్‌హౌస్‌లో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 400 వాకి-టాకీలు వినియోగించనున్నామని ఆయన తెలియచేశారు. 1400 సిసి కెమేరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నామని, ఎప్పటికప్పుడు యాత్రికుల రద్దీని విశే్లషించి, అవసరమైతే వారిని వేర్వేరు ఘాట్‌లకు పంపించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని రాజశేఖర్ సిఎంకు వివరించారు. పుష్కరాల్లో సెల్ ఫోన్‌ల వినియోగానికి ఎటువంటి ఇబ్బంది కలుగకుండా కృష్ణా నది గట్టున 16 తాత్కాలిక, ఎనిమిది శాశ్వత సెల్ టవర్లను నిర్మిస్తున్నమని తెలిపారు. ఇన్‌చార్జ్ డిజిపి సాంబశివరావు మాట్లాడుతూ ట్రాఫిక్ ఏ ప్రాంతంలోనూ నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఏ రూట్‌లోనైనా ట్రాఫిక్ సమస్య తలెత్తినా, ట్రాఫిక్‌ను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.