ఆంధ్రప్రదేశ్‌

ఓటుహక్కు వినియోగం అందరి నైతిక బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 17: ఓటుహక్కు వినియోగించుకోవడం అందరూ తమ నైతిక బాధ్యతగా గుర్తించాలని ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజ్ఞప్తి చేశారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ఓటుహక్కుపై అవగాహన కల్పించే ర్యాలీని జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈసందర్భంగా సింధు మాట్లాడుతూ రానున్న సాధారణ ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటుహక్కు వినియోగించుకోవాలని ఓటర్లను కోరారు. స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో యువత పాత్ర ఎంతో కీలకమన్నారు. ఓటు వేయడం ద్వారా యువత ఆ బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ బందరురోడ్డు మీదుగా బెంజి సర్కిల్‌కు చేరింది. అక్కడ ఏర్పాటు చేసిన 15 అడుగుల బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్‌తో పాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ వద్ద పీవీ సింధు సెల్ఫీ దిగారు. అనంతరం బెంజి సర్కిల్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. మానవహారంగా ఏర్పడి ‘్భరతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తాం’ అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ ద్వారకాతిరుమలరావు, స్వీప్ కన్వీనర్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జేసీ-2 పీ బాబూరావు, డీటీసీ ఈ మీరాప్రసాద్, ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డా. వెలగా జోషి, యువ ఓటర్లు పాల్గొన్నారు.
చిత్రం.. ఓటుహక్కు వినియోగంపై ప్రజా చైతన్య ర్యాలీలో పీవీ సింధు, జిల్లా ఉన్నతాధికారులు