ఆంధ్రప్రదేశ్‌

ఎయిడెడ్ పోస్టుల భర్తీలో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మార్చి 18: రాష్ట్రంలో ఇటీవల కొన్ని మైనార్టీ విద్యాసంస్థల్లో చేపట్టిన ఎయిడెడ్ పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ పోస్టులను ఫోర్జరీ లేఖతో భర్తీచేశారనే ఆరోపణ వినిపిస్తోంది. ది కనె్వన్షన్ ఆఫ్ బాప్టిస్టు చర్చెస్ ఆఫ్ ది నార్తరన్ సర్కార్స్ (సీబీసీఎన్‌సీ) క్రైస్తవ మైనార్టీ సంస్థలో ఖాళీగా వున్న 276 ఎయిడెడ్ పోస్టుల భర్తీలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. వివరాలిలావున్నాయి... ప్రాథమిక స్థాయిలో ఉచిత నిర్బంధ విద్య విషయమై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎయిడెడ్ పోస్టులపై వున్న నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న సీబీసీఎన్సీ విద్యాసంస్థల్లో 276 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో 8, విజయనగరం జిల్లాలో 58, విశాఖపట్నం జిల్లాలో 28, తూర్పుగోదావరి జిల్లాలో 39, పశ్చిమ గోదావరి జిల్లాలో 19, కృష్ణా జిల్లాలో 112, గుంటూరు జిల్లాలో 2 ఎయిడెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ ఉద్యోగాలను మైనార్జీ సంస్థల యాజమాన్యం నియమించుకుంటుంది.
దీనితో సీబీసీఎన్సీ ఎడ్యుకేషనల్ కమిటీ పేరుతో ఒక సంస్థను సృష్టించి ఆ సంస్థ కన్వీనర్ హోదాలో ఎయిడెడ్ పోస్టుల నియామకం చేసుకునేలా పావులు కదిపారు. కన్వీనర్ పదవి కోసం ఇద్దరు వ్యక్తులు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో పావులు కదిపారు. ఎట్టకేలకు సుందరరాజు అనే వ్యక్తి కన్వీనర్‌గా ఉత్తర్వులు సాధించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.
కాగా సీబీసీఎన్సీ సంస్థ రిజిస్ట్రేషన్ 1990 నుంచి రెన్యువల్ జరగడంలేదు. దీంతో కొందరు ప్రబుద్ధులు ఎడ్యుకేషనల్ కమిటీ ఆఫ్ సీబీసీఎన్సీ అనే ఒక సంస్థను సృష్టించి దానికి 1948లోని రిజిస్టర్ నెంబర్ నెంబర్ 16 తగిలించారు. ఈ నెంబరు ఆధారంగానే ప్రభుత్వంతో వ్యవహారాలు నిర్వహించి, నియామకాలకు తెరలేపినట్టు తెలుస్తోంది. సీబీసీఎన్సీ రిజిస్టర్డ్ కార్యాలయం కాకినాడలోవుంది. అయితే ఎడ్యుకేషనల్ కమిటీ ఆఫ్ సీబీఎన్సీ అనే సంస్థ తమ కార్యాలయంలో రిజిస్టర్ కాలేదని తూర్పు గోదావరి జిల్లా రిజిస్ట్రార్ ఎండార్స్‌మెంట్ ఇవ్వడంతో ఈ నియామకాలన్నీ బోగస్ అని తేటతెల్లమయ్యింది. ఇప్పటికే ఈ ఉద్యోగాల పేరుతో కొందరు నిరుద్యోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. తూర్పు గోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ సూచనల మేరకు కాకినాడలోని ఇంద్రపాలెంకు చెందిన ఒకరిని అరెస్టు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని భారత న్యాయవాదుల సంఘం కార్యవర్గ సభ్యులు అయినాపురపు సూర్యనారాయణ కోరారు.