ఆంధ్రప్రదేశ్‌

పోలవరంపై విషం చిమ్ముతున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, మార్చి 18: పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం విషం చిమ్ముతోందని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. ఈ ప్రాజెక్ట్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరం బ్యాక్ వాటర్‌పై పరిశీలన జరపాలని సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కేసు దాఖలు చేసిందని ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కేసీఆర్ కుమార్తె నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎస్‌జీటీ)లో పోలవరంపై కేసు వేశారని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సామంతరాజులా ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఉన్నందునే తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసిందని ఆక్షేపించారు. ఇప్పటికి 67.2 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు మంజూరు చేయకుండా అడ్డుకుందని ఆరోపించారు. పోలవరం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిన రూ. 4341 కోట్ల నిధులు కేంద్రం విడుదల చేయలేదన్నారు. ఈ ఏడాది జూన్‌లో గ్రావిటీ ద్వారా నీరిచ్చేందుకు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల్లో లేని అనుమానాలను సృష్టిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తుంటే స్వప్రయోజనాల కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. పోలవరాన్ని అడ్డుకునేందుకు కేసీఆర్‌తో చేతులు కలపటం దుర్మార్గమన్నారు. కేసు వేయటం అంటే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లవుతుందని వివరించారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే రైతులు బాగుపడతారని, అది ఇష్టంలేక కేసీఆర్ కేసులు వేస్తున్నారని, ఆయనకు జగన్ మద్దతిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చే వెయ్యి కోట్లకు కక్కుర్తిపడి వారితో చేతులు కలిపి రాష్ట్రానికి జగన్ తీరని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం పనులు ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కేసులు వేసి అడ్డుకుంటుంటే జగన్ దోస్తీ అనటాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటుగా చిత్రీకరించి నాలుక్కరుచుకున్నారని విమర్శించారు. హత్యా, శవ రాజకీయాలు జగన్‌కు అలవాటేనని విమర్శించారు.