ఆంధ్రప్రదేశ్‌

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి నేటితో తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 19: శాసనమండలి కృష్ణా-గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాల పట్ట్భద్రుల నియోజకవర్గాల్లోనూ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఈ నెల 22వ తేదీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకల్లా ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. ఈ ఎన్నికలు జరిగే కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మొత్తం ఏడు జిల్లాల్లోను ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి 22వ తేదీ సాయంత్రం వరకు 48 గంటలపాటు మద్యం దుకాణాలన్నీంటినీ మూసివేయబోతున్నారు. దీంతో కొందరు అభ్యర్థులు ముందుగా తమకు అవసరమైన మద్యాన్ని రహస్య ప్రాంతాల్లో నిలువ చేస్తున్నారు. సాధారణ ఎన్నికలకు కొద్ది రోజులు ముందుగా ఈ ఎన్నికలు జరుగుతుండటంతో ప్రధానపక్షాలన్నీ దూరమయ్యాయి. అయినప్పటికీ ప్రచారం హోరెత్తింది. కృష్ణా-గుంటూరు పట్ట్భద్రుల నియోజకవర్గంలో 40 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. మొత్తం 2 లక్షల 60వేల మంది ఓటర్లు ఉండగా 302 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆరేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో సీపీఎం బలపర్చిన బొడ్డు నాగేశ్వరరావు గెలుపొందారు. అయితే ఈదఫా పోటీకి దూరం కాగా గత ఎన్నికల్లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కెఎస్ లక్ష్మణరావు ఈసారి పోటీపడుతున్నారు. ఇక దళిత, మైనార్టీ, బలహీన వర్గాల సంఘాలు తరపున డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు, అలాగే విద్యావేత్త నూతలపాటి అంజయ్య, కృష్ణప్రసన్న వైట్ల, శాఖమూరి శ్రీనివాస ప్రసాద్, కోట సాయికృష్ణ తదితరులు గట్టిగా పోటీ పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి మొత్తం 46 మంది పోటీపడుతున్నారు. మొత్తం 2లక్షల 93వేల మంది ఓటర్లు ఉండగా 339 పోలింగ్ కేంద్రాలు ఏర్పటయ్యాయి. గత ఎన్నికల్లో సీపీఎం బలపర్చిన ఉత్తమ ఉపాధ్యాయుడు రాము సూర్యారావు గెలిచారు. ఈదఫా ఆ పార్టీ తరపున యుటీఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ఇళ్లా వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు ఆదిత్య విద్యాసంస్థల యజమాని నల్లమల్లి శేషారెడ్డి, రాజమహేంద్ర విద్యా సంస్థల అధినేత టీకె విశే్శశ్వరరావు మరో ముగ్గురు గట్టి పోటీనిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 15వేల 593 మంది అభ్యర్థులకు గాను 123 పోలింగ్ కేంద్రాలు ఏర్పటయ్యాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడు తిరిగి పోటీ పడుతుండగా దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు మద్దతునిస్తున్నాయి.