ఆంధ్రప్రదేశ్‌

బాలకృష్ణ కుటుంబ ఆస్తులు రూ.274 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం, మార్చి 22: హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన సినీనటులు నందమూరి బాలకృష్ణ తన కుటుంబ సభ్యుల ఆస్తులను రూ.274 కోట్లుగా అఫిడివిట్‌లో పేర్కొన్నారు. స్థిర, చర, బంగారు ఆభరణాలు, వాహనాలు ఇలా తనకున్న అన్ని ఆస్తుల విలువను మార్కెట్ విలువ ఆధారంగా లెక్కగట్టి ఇందులో పేర్కొన్నారు. తన పేర బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సొమ్ము, షేర్లు, డిబెంచర్లు, బంగారు ఆభరణాలు అన్నీ కలిపి చరాస్తులు రూ.46.79 కోట్లుగా పేర్కొన్నారు. తన పేర ఉన్న భూములు, భవనాలు, వాణిజ్య సముదాయాల మార్కెట్ విలువను రూ.77.46 కోట్లుగా పేర్కొన్నారు. మొత్తం వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు రూ.124 కోట్లుగా పొందుపరిచారు. భార్య వసుంధర చరాస్తుల విలువ రూ.50 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ. 30.91 కోట్లు, కుమారుడు మోక్షజ్ఞ చరాస్తులు రూ.16.43 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ రూ.25.85 కోట్లు, కుటుంబానికి సంబంధించిన చరాస్తులు రూ.1.37 కోట్లు ఉండగా స్థిరాస్తులు 24.83 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తనపేర రూ.14.12 కోట్ల అప్పులు ఉండగా, భార్య పేర రూ.1.18 కోట్లు, కుమారుడి పేర రూ.12 లక్షలు ఉన్నట్లు పొందుపరిచారు. కుటుంబానికి సంబంధించి మొత్తంగా రూ.15.58 కోట్ల అప్పులు ఉన్నట్లు ప్రకటించారు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తనకు రూ.11.36 కోట్లు, భార్య వసుంధరకు రూ.1.65 కోట్లు, కుమారుడు మోక్షజ్ఞకు రూ.18.51 లక్షలు, కుటుంబానికి సంబంధించి రూ.10.62 లక్షల ఆదాయం వచ్చినట్లు ఆదాయపు పన్నుశాఖ రిటర్న్ దాఖలు చేసినట్లు అఫిడివిట్‌లో పేర్కొన్నారు.
బాలకృష్ణ పేర వ్యక్తిగతంగా నిమ్మకూరులో ఏడు ఎకరాల వ్యవసాయ పొలం, హైదరాబాద్ రాయదుర్గంలో 1111 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, హైదరాబాద్‌లోని ముషీరాబాద్, సోమాజీగూడ, జుబ్లీహిల్స్, చెన్నైలోని సయ్యద్‌పేటలో వాణిజ్య భవనాలకు సంబంధించి రూ.64 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని నివాస గృహంవిలువ రూ.9.32 కోట్లుగా చూపించారు. భార్యకు సంబంధించి శేరిలింగంపల్లి, మాదాపూర్, రాయదుర్గం, గుంటూరు జిల్లా రాయపూడి, చెన్నైలోని అన్నాసలై, సయ్యద్‌పేటలో రూ.30 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. వారి కుటుంబానికి మాదాపూర్, జుబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో రూ.45 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. కుమారుడు మోక్షజ్ఞకు మాదాపూర్, చెన్నైలోని సయ్యద్‌పేటలో రూ.5 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రచార సమయంలో జిల్లాలోని బుక్కరాయసముద్రం, గుత్తి పోలీసుస్టేషన్ల 2009లో రెండు కేసులు నమోదైనట్లు వివరించారు. అలాగే విజయవాడ కోర్టులో మూడు కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడివిట్‌లో కనబర్చారు.