ఆంధ్రప్రదేశ్‌

ముస్లింలకు అండగా టీడీపీ : చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 23: దేశ ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తూ కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. శనివారం రాత్రి గుంటూరు నగరంలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడుతూ మోదీ, కేసీఆర్, జగన్ ముసుగు దొంగలని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారన్నారు. గోద్రా అల్లర్ల విషయంలో నరేంద్రమోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో తనపై కక్షసాధింపుకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నుండి లక్షా 25 వేల కోట్లు రావాల్సి ఉండగా వాటిని ఎగ్గొట్టేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్నారు. ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లింలకు అండగా నిలిచామని, మైనార్టీల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకున్నామన్నారు. కేసీఆర్ స్విచ్ వేయకపోయినా, మోదీ కరెంట్ సప్లై చేయకపోయినా ఇక్కడ ఫ్యాన్ తిరిగే పరిస్థితి ఉండదని, దీన్ని ప్రజలు గమనించాలని, ఫ్యాన్‌ను చిత్తుచిత్తుగా చితక్కొట్టి ఓడించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
చిత్రం.. గుంటూరు రోడ్‌షోలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు