ఆంధ్రప్రదేశ్‌

పుష్కరాలకు భారీ బందోబస్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 30: గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలను ఒక అనుభవంగా తీసుకుని కృష్ణా పుష్కరాలలో ఏ ఒక్క యాత్రికుడు కూడా ప్రవేశం నుంచి తమ తమ గమ్యాలకు చేరేవరకు కూడా ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఎంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. ఇందుకోసం అన్ని స్థాయిల్లోనూ పోలీస్, రెవెన్యూ శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయనున్నాయన్నారు. కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో 24 వేల మందితో పకడ్బందీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ భవన్‌లో శనివారం మూడు జిల్లాల పోలీస్, ఆర్టీసీ, రవాణాశాఖ ఉన్నతాధికారులతో నండూరి సమావేశమై పుష్కరాలు సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ కేవలం సిటీ సర్వీసులకే పరిమితం చేస్తున్నామంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బస్సులకు శాటిలైట్ బస్, రైల్వే స్టేషన్‌ల వద్ద నిలుపుదల చేసి అక్కడ నుంచి స్నాన ఘాట్లకు, దేవాలయాలకు బస్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. ఈ విషయమై ఏ ఒక్కరూ తికమక, కంగారు పడకుండా కరపత్రాలు, పోస్టర్‌లు, మీడియా ద్వారా ముందస్తు ప్రచారం చేస్తామన్నారు. పైగా మైక్ అనౌన్స్‌మెంట్ నిరంతరం ఉంటుందన్నారు. ఒక్క విజయవాడ నగరంలోనే 1300 సిసి కెమెరాలను ఏర్పాటు చేసి పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్, ఎఆర్ పోలీస్ గ్రౌండ్‌లోనూ కమాండ్ సెంటర్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ ట్రాఫిక్ రద్దీ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ స్తంభించింది, ఏ ఘాట్ ఖాళీగా ఉంది, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అవసరమైతే యాత్రికులను కొద్దిసేపు నిలువరించి రద్దీ లేని ప్రాంతాల వైపుకి మళ్లిస్తామన్నారు. నష్టం వచ్చినా పర్వాలేదనుకొని అత్యవసర సమయాల్లో వినియోగించుకోటానికి 600 బస్సులను ఎల్లవేళలా సిద్ధంగా ఉంచుతామన్నారు. గోదావరి పుష్కరాల్లో రద్దీ నివారణ కోసం ప్రయాణికులను టిక్కెట్ లేకుండా నిలబెట్టి బస్సులను నడపాల్సి వచ్చిందని, ఈ దఫా అలాంటి పరిస్థితి రాబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. నగరంలో 22 ప్రైవేట్ పార్కింగ్ ప్రదేశాలను గుర్తించామని అక్కడ నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆటోవాలాలు, హోటళ్లు, లాడ్జీల యజమానులు తమ ఇష్టానుసారం రేట్లు పెంచకుండా తగు చర్యలు తీసుకునే విషయంలో సంబంధిత శాఖలతో సంప్రదింపులు జరుపగలమని ఓ ప్రశ్నకు సమాధానంగా నండూరి చెప్పారు. 12 నుంచి 24 వరకు అన్నీ మంచిరోజులేనని, అన్నీ శుభఘడియలే కనుక యాత్రికులు హడావుడి పడాల్సిన పనిలేదన్నారు. ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, సీనియర్ పోలీస్ అధికారులు ఎన్‌వి సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.