ఆంధ్రప్రదేశ్‌

అంత అవసరమా...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 30: అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరం నగరం ఇనుప బ్యారికడ్ల నడుమ ఉక్కిరిబిక్కిరి కానుంది. అంతంతమాత్రంగా భక్తులు తరలివచ్చే అంత్య పుష్కరాలకు రాజమహేంద్రవరం కేంద్రంగా సాగుతున్న భద్రతాఏర్పాట్లపై పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. గత ఏడాది మహా పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనను దృష్టిలో పెట్టుకునో ఏమో భద్రతా ఏర్పాట్లు అప్పటి స్థాయిలోనే చేస్తున్నారు. నాటి పుష్కరాల్లో పోలీసుల అవగాహన లోపమే ప్రధానంగా కొంపముంచింది. వేల సంఖ్యలో భక్తులు తరలి వచ్చినపుడు వేరే ఘాట్లకు మళ్లించకుండా ఒకేచోట ఉంచడంవల్ల నాటి తొక్కిసలాట ఘటన చోటుచేసుకుంది. ఇపుడు కూడా అనవసర బ్యారికేడ్ల కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంత్య పుష్కరాలకు జనం వస్తారు కానీ భయపెట్టేంత జనం రారు.. ఈ అంశంలో గత అంత్య పుష్కరాల్లో పనిచేసిన అధికారుల సలహాలు, సూచనలు తీసుకుని ఉంటే బావుండేది. అది తెలీకుండా పోలీసుల అతిజాగ్రత్త చర్యలు కొత్త సమస్యలు సృష్టించేవిగా ఉన్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజుల ముందు నుంచే పుష్కర ఘాట్ నుంచి దాదాపు త్రీ టౌన్ పోలీసుస్టేషన్ వరకు బారికేడ్లు నిర్మించారు. దీని వల్ల ఆ రోడ్డులో ఉండే ట్రాఫిక్ సమస్య మరింత ఎక్కువయ్యింది. కేవలం పుష్కర ఘాట్‌కు సమీపంలో రైల్వేట్రాక్ అండర్ బ్రిడ్జి నుంచి పుష్కర ఘాట్ వరకు బారికేడ్లు నిర్మిస్తే సరిపోతుందనేది నగరవాసుల అభిప్రాయం. మరో వైపు పుష్కర ఘాట్ ముందు నుంచి కోటగుమ్మం జంక్షన్ వరకు బారికేడ్లు నిర్మించడం కూడా అనసవరమనే భావన వ్యక్తమవుతోంది. మార్కండేయ ఘాట్ వద్ద కూడా బారికేడ్లు నిర్మించారు. రోజుకు యాభైవేల మంది యాత్రికులు వస్తే ఎక్కువ అన్నట్టుగా ఉంది. అంతకుమించి కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో రద్దీ సాధారణంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. సజావుగా సాగిపోయే జన ప్రవాహాన్ని నియంత్రించడానికి బారికేడ్లు నిర్మించి, రోడ్లను మరింత ఇరుకుచేసి కొత్త ఇబ్బందులు తెచ్చిపెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంక్రీటు రోడ్లను ఛిద్రం చేస్తూ బారికేడ్లు నిర్మించడంవల్ల ఎటువంటి ప్రయోజనం కన్పించడం లేదనిపిస్తోంది. అఖండ గోదావరి నదిలో రాజమహేంద్రవరంలోని కోటిలింగాల ఘాట్, పుష్కరఘాట్, టిటిడి ఘాట్, పద్మావతి ఘాట్, మార్కండేయ ఘాట్, శ్రద్ధానంద ఘాట్, విఐపి సరస్వతి ఘాట్, గౌతమి ఘాట్‌లను స్నానాలకు అనుమతిచ్చినప్పటికీ విఐపి ఘాట్ లోతు ఎక్కువగా ఉండి ప్రమాదభరితంగా మారింది. ఈ ఘాట్‌లోనే మంత్రులు రాజప్ప, యనమల, ఇతర జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులంతా పుష్కర స్నానాలు ఆచరించేందుకు ఏర్పాట్లుచేశారు. ఈ ఘాట్ స్నానాలకు శ్రేయస్కరంగా లేదు. ఇక్కడ స్నానాలకు అనుమతించకుండా చర్యలు తీసుకుంటే శ్రేయష్కరమనే వాదన వినిపిస్తోంది. గౌతమీ ఘాట్, పుష్కర ఘాట్‌లలో పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు పక్కాగాచేశారు. కోటిలింగాల ఘాట్ కొంత భాగంలోనే స్నానాలు ఆచరించేలా ఏర్పాట్లు చేశారు. మొత్తమీద స్నాన ఘట్టాలన్నీ సర్వాంగ సుందరంగా సిద్ధమయ్యాయి. మొత్త 40చోట్ల సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. హైమాస్ట్ లైట్లు ఏర్పాటుచేశారు. దాదాపు మూడువేల మంది పోలీసులతో నాలుగు జోన్లుగా విభజించి, జోన్‌కి ఒక డివిజనల్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని నియమించారు.