ఆంధ్రప్రదేశ్‌

వెంకన్న బంగారంపై సత్యశోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: తమిళనాడులో పట్టుబడ్డ వెంకన్న బంగారంగా భావిస్తున్న 1381 కేజీల బంగారంపై తలెత్తిన అనుమానాలతో ప్రభుత్వం సత్యశోధనకు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 23వ తేదీలోపు పూర్తిస్థాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని సీ ఎస్ విచారణ అధికారిని ఆదేశించారు. ఇదిలావుండగా పట్టుబడ్డ బంగారానికి సంబంధించి కమలానందభారతీస్వామి పలు రకాల అనుమానాలు వ్యక్తం చేయడంతోపాటు టీటీడీ ఈ ఓ , జే ఈ ఓలపై పరుషపదాలను వినియోగించారు. కొంత సేపటికే తాను స్వామీజీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని, వాటిని ఉప సంహరించుకుంటున్నట్లు ప్రకటన చేయడం వెనుకున్న ఆంతర్యం ఏమిటన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. టీటీడీ యాజమాన్యం వైపు నుంచి పరిశీలిస్తే మూడేళ్ల క్రితం చెన్నయ్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో టీటీడీ డిపాజిట్ చేసిన బంగారానికి 70 కేజీలు బంగారం వడ్డీగా చేరి 1381 కేజీల బంగారం టీటీడీదేనని కొంత ఆలస్యంగా ఈ ఓ ఏకె సింఘాల్ ప్రకటన చేశారు. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా తనిఖీల్లో పట్టుబడ్డ బంగారం ఎక్కడికో తరలిస్తున్నారని , పలు కారణాలతో ఈ బంగారం తమదేనని టీటీడీ ప్రకటన చేసిందనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అయ్యాయి. అంతేకాకుండా 1381 కేజీల బంగారం తమిళనాడు నుంచి ఏపీకి తరలిస్తున్న నేపథ్యంలో బంగారం తరలిస్తున్న వాహనం కాని, ఎలాంటి సెక్యూరిటీ లేకపోవడం, బ్యాంకు అధికారులు సరైన కారణం చెప్పకపోవడమే మరో కారణంగా చెప్పవచ్చు. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో రూ.50వేలు నగదుకాని, బంగారు కాని తరలిస్తే ఎన్నికల నేపథ్యంలో తనిఖీలు చేసే అధికారులు స్వాధీనం చేసుకుని ఆప్రాంతంలో ఉన్న ట్రెజరీకి తరలించే అవకాశాలుంటాయి. నియమాలకు మించి నగదుకాని, బంగారం కాని తరలించే సమయంలో సరైన ఆధారాలు చూపిస్తే అధికారులు వాటిని వదిలేస్తారు. అలాంటిది శ్రీవారికి చెందిన బంగారంగా చెప్పుకున్న 1381 కేజీల బంగారానికి సంబంధించి సరైన పత్రాలను పొందుపరచడంలో బ్యాంకు అధికారులు ఎందుకు వైఫల్యం చెందారు? అలాగే టీటీడీ అధికారులు కూడా నిజంగా అది శ్రీవారి బంగారమే అయితే ఆవిషయంపై వెంటనే ఎందుకు స్పందించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఇలాంటి అనుమానాలు, ఆరోపణలకు తెరదించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ మన్మోహన్ సింగ్‌ను విచారణ అధికారిగా నియమించి తక్షణమే తిరుమలకు వెళ్లి బంగారం తరలింపు సందర్భంగా జరిగిన భద్రతాలోపాలుపైన, వచ్చిన ఆరోపణలపైన విచారణ జరిపించాలని ఆదేశించారు. 23వ తేదీలోపు విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అనుమానాలు, ప్రశ్నలు ఎన్ని ఉన్నా శనివారం రాత్రి 1381 కేజీల బంగారం తిరుపతిలోని టీటీడీ ట్రెజరీకి చేరింది. ఇదిలా ఉండగా ఇంత పెద్ద ఎత్తున బంగారాన్ని తరలించే సమయంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు కూడా సమర్థవంతంగా వ్యవహరించలేదన్న విమర్శలు వెలువడుతున్నాయి. కాగా టీటీడీ ఏ బ్యాంకులో అయినా బంగారాన్ని డిపాజిట్ చేసినప్పుడు కాలపరిమితి తీరిన తరువాత ఆ బంగారాన్ని భద్రంగా టీటీడీ అప్పగించే వరకు అది బ్యాంకు అధికారుల బాధ్యతని టీటీడీ అధికారులు వాదిస్తున్నారు. ఇందులో తప్పు జరిగిందో, లేదో తెలియదు కాని మొత్తం మీద వెంకన్న బంగారంపై సత్యశోధన మాత్రం తప్పనిసరిగా మారింది. అంతా కలి మాయ...