రాష్ట్రీయం

సెప్టెంబర్ 11న టి.ఎమ్సెట్-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 2: ఎట్టకేలకు తెలంగాణ ఎమ్మెట్-3 షెడ్యూలు ఖరారైంది. ఎమ్సెట్-2 పేపర్ లీక్ కావడంతో మరోసారి పరీక్షను సెప్టెంబర్ 11న నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఎమ్సెట్ -3 పరీక్ష కన్వీనర్‌గా జెఎన్‌టియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్యను నియమించింది. గతంలో జారీ చేసిన హాల్‌టిక్కెట్‌తోనే అభ్యర్థులు పరీక్షకు హాజరుకావచ్చు. అదే హాల్‌టిక్కెట్ నెంబర్‌తో పరీక్ష రాసే వీలుందని ఉన్నత విద్యామండలి అధికారులు చెప్పారు. పరీక్ష రోజు హాల్‌టిక్కెట్ చూపించి ఉచితంగా బస్సులో కేంద్రాలకు చేరుకోవచ్చన్నారు. దీనివల్ల మరోమారు పరీక్షకు దరఖాస్తు చేసే అవసరం లేకుండా పరీక్ష ఫీజు మినహాయింపు దక్కినట్టయిందన్నారు. పరీక్షను ఈసారీ ఆంధ్రలోనూ నాలుగు కేంద్రాల్లో (తిరుపతి, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం) నిర్వహించనున్నారు. తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్ జోన్ ఎ, జోన్ బి, జోన్ సి ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
56వేల మందికి హాల్‌టిక్కెట్లు
ఆదిలాబాద్‌లో 932, కరీంనగర్‌లో 3361, ఖమ్మం 2172, కర్నూలు 2710, మహబూబ్‌నగర్ 2538, నల్గొండ 2160, నిజామాబాద్ 1702, తిరుపతిలో 3588, విజయవాడలో 6542, విశాఖపట్టణంలో 7542, వరంగల్‌లో 4701, హైదరాబాద్ జోన్ ఎలో 5164, జోన్ బిలో 6476, జోన్ సిలో 9008 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. అభ్యర్థులు అదే హాల్‌టిక్కెట్లతో పరీక్షలకు హాజరుకావల్సి ఉంటుంది. ఎమ్సెట్-2లో 56153 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేయగా, పరీక్షకు మాత్రం 50964 మంది హాజరయ్యారు. చివరికి ర్యాంకులు సాధించింది 47,544 మంది. అయితే ఈసారి ఎంత మంది పరీక్షకు హాజరవుతారనేది చూడాల్సి ఉంది.
అక్రమార్కుల సంగతేమిటి?
పేపర్ లీక్‌కు పాల్పడిన విద్యార్థుల విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. అక్రమాలకు పాల్పడిన ఏజెంట్లు, వారి సహచరులను అరెస్టు చేసిన ప్రభుత్వం ఇంతవరకూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఒకవేళ విద్యార్థులను అరెస్టు చేసినట్టయితే, టాప్ ర్యాంకర్లుగా నిలిచిన అభ్యర్థులు పరీక్షకు దూరం కావాల్సి ఉంటుంది. ఎమ్సెట్-2 పేపర్ లీక్ అంశంతోపాటు అనేక అక్రమాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ప్రభుత్వం వాటన్నింటిపైనా రహస్య విచారణ జరిపిస్తోంది.
మొదలైన శిక్షణ
నిన్నటి వరకూ ఎమ్సెట్ భవితవ్యం తేలక గందరగోళంలో ఉన్న విద్యార్ధులు పాత పుస్తకాల బూజు దులిపారు. కార్పొరేట్ శిక్షణ సంస్థలు మరోమారు శిక్షణ ప్రారంభించాయి. గతంలో అనుకున్న రీతిలో ప్రగతి సాధించలేకపోయిన విద్యార్థులకు ఇదో గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. మంచి ర్యాంకులు వచ్చిన వారు డీలాపడగా, కొద్దిగా పెద్ద ర్యాంకులు వచ్చిన వారు మాత్రం ఆనందంగా ఉన్నారు. ఈసారి మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు వీలుచిక్కిందని వారు చెబుతున్నారు.

టేబుల్:
ఎమ్సెట్-3 సెప్టెంబర్ 11న
పరీక్ష సమయం ఉదయం 10 నుండి ఒంటి గంట
సెట్ నిర్వాహక వర్శిటీ జెఎన్‌టియు
ఆర్గనైజింగ్ కమిటీ ఉన్నత విద్యామండలి
సెట్ చైర్మన్ జెఎన్‌టియు విసి
సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్ యాదయ్య
పరీక్ష ఫలితాలు సుమారు సెప్టెంబర్ 20న