ఆంధ్రప్రదేశ్‌

ఏమిస్తారు.. ఎప్పుడిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: ‘విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. కాంగ్రెస్ చేసిన తప్పిదాలను ప్రజలకు ఎత్తిచూపి, వారిని చైతన్యవంతులను చేయబట్టి టిడిపి, బిజెపి అధికారంలోకి వచ్చాయి. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చాలి. లేకుంటే ప్రజలకు అన్యాయం చేసిన వారమవుతాం. రాష్ట్ర ప్రయోజనాలను ఆశించే నేను కేంద్రానికి సహకరిస్తున్నాను. వారు హామీ నిలబెట్టుకోకుంటే నేనూ సహకరించను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో మంగళవారం రాత్రి జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘రాజ్యసభలో మంగళవారం తెలుగుదేశం ఎంపీలు ప్రత్యేక హోదా గురించి గట్టిగా మాట్లాడారు. దీనిపై జైట్లీ స్పందించి ఏపి సమస్యలపై చర్చిస్తున్నాం. ఏపికి సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. ఆందోళన విరమించాలని మా ఎంపిలకు హామీ ఇచ్చార’ని చెప్పారు. అంతకుముందు జైట్లీ తనతో ఫోన్‌లో సంప్రదించారని తెలిపారు. కేంద్రం ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టుందని విలేఖరులు ప్రస్తావించగా.. అందుకే కేంద్రం ఏమిస్తుందో ముందు చెప్పమని అడిగానన్నారు. అదికూడా ఎప్పటిలోగా ఇస్తారో కూడా చెప్పమన్నానన్నారు. వారిచ్చిన మాట నిలబెట్టుకోపోతే, తన నుంచి కూడా సహకారం ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘టిడిపి ఎప్పుడూ రాజీపడదు. ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తోంది. రెండేళ్ల పసిబిడ్డలాంటి రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలతో కానీ, కేంద్రంతో కానీ ఘర్షణకు దిగితే నష్టపోయేది మనమే. మనకు పూర్తిగా అన్యాయం జరుగుతుంటే పోరాటానికి కూడా వెనుకాడం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ కావాలని ఎంపీలు లేఖ రాశారని, దానిపై ఇప్పటివరకూ స్పందన రాలేదని తెలిపారు. ఈ నెల 4న ఢిల్లీకి వెళ్లి కృష్ణా పుష్కరాలకు రావాల్సిందిగా ప్రధానిని కోరనున్నానని ఆయన చెప్పారు. ఈ సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావిస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. సమయం దొరికినప్పుడల్లా దాని గురించే అడుగుతున్నానని అన్నారు. కేంద్రం ఉదారంగా డబ్బులు ఇచ్చివుంటే ఇప్పుడు తనకు ఇలాంటి దయనీయ పరిస్థితి వచ్చి ఉండేది కాదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఇంత కచ్చితంగా ఉన్నప్పటికీ విపక్షాలు తనను తప్పుపడుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రాన్ని తాను నిలదీస్తే కేసులు పెడుతుందని ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రధాన మంత్రి ముఖ్యమంత్రిపై విచారణకు ఆదేశించిన దాఖలాలు ఉన్నాయా? అది జరిగే పనేనా? అని చంద్రబాబు ప్రశ్నించారు. తన జీవితంలో ఎప్పుడూ తప్పు చేయలేదన్నారు. తప్పు చేయనని, అందుకే తనకు టెన్షన్స్ లేవని ఆయన చెప్పారు. కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంతవరకూ సమంజసమని చంద్రబాబు ప్రశ్నించారు.
కాంగ్రెస్, వైకాపా కుట్ర రాజకీయాలు
కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని చంద్రబాబు ఆరోపించారు. హోదాపై ప్రైవేటు బిల్లు పెట్టిన కాంగ్రెస్ అర్థంతరంగా చర్చ నుంచి ఎందుకు వైదొలగిందని ఆయన ప్రశ్నించారు. హోదాకు మద్దతుగా టిడిపి ఎంపీలు ఆందోళన చేస్తుంటే కాంగ్రెస్ సభ్యులు ఎందుకు సహకరించలేదని ఆయన ప్రశ్నించారు. జిఎస్‌టి బిల్లు ఆమోదం పొందాలంటే కాంగ్రెస్ పార్టీ సహకారం ఎన్డీఏకు అవసరం కదా! వారు సహకరిస్తారా? అని విలేఖరులు ప్రశ్నించగా.. హోదాపై ప్రైవేటు బిల్లు పెట్టి, స్పష్టమైన హామీ లభించనందున కాంగ్రెస్ పార్టీ జిఎస్‌టి బిల్లును అడ్డుకోవాలి కదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. అందరికన్నా ముందే వైకాపా ఎన్డీఏ దగ్గరకు వెళ్లి జిఎస్‌టికి సహకరిస్తామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేయాలనుకుంటే, వాళ్లే మోసపోతారని చంద్రబాబు హెచ్చరించారు.

చిత్రం... విలేఖర్ల సమావేశంలో సిఎం చంద్రబాబు