బిజినెస్

టీటీడీ నాణేలకు మోక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 2: సుమారు పదేళ్ల క్రితం భక్తులు హుండీలో సమర్పించిన ఐదు, పది పైసల చెల్లని నాణేల విక్రయానికి ఎట్టకేలకు మోక్షం లభించనుంది. దీంతో శ్రీవారికి 24 లక్షల 30 వేల రూపాయలు ఆదాయం లభించనుంది. కలియుగ శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి వచ్చే సామాన్య భక్తులు తాము కూడబెట్టుకున్న ఐదు, పది పైసల నుండి రూపాయ కాయిన్‌ల వరకు హుండీలో సమర్పిస్తున్న విషయం పాఠకులకు విధితమే. 2009లో ఐదు, పది పైసల నాణేలను ఆర్‌బిఐ రద్దు చేసింది. రెండ మాసాల గడువు ఇచ్చి ఆ నాణేలను బ్యాంకుల్లో జమ చేసుకోవచ్చునని టీటీడీకి అవకాశం ఇచ్చింది.
విదేశీ నోట్లు, నాణేలు, స్వదేశానికి సంబంధించిన పెద్ద నోట్లకు అలవాటు పడ్డ అధికారులు ఈ నాణేలను బ్యాంకుల్లో మార్చుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీంతో దాదాపు 90 టన్నుల ఐదు, పది పైసల నాణేలు టీటీడీ ఖజానాలో నిల్వ ఉండిపోయాయి. ఈ కాయిన్స్ గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల రెండు సంవత్సరాల క్రితం టీటీడీ కార్యదర్శి బాధ్యతలు తీసుకున్న ఏకే సింఘాల్ ఆ నాణేలను మార్పు కోసం ఆర్‌బిఐకి లేఖలు రాశారు. అయితే అది సాధ్యం కాదని ఆర్‌బిఐ తేల్చి చెప్పింది. దీంతో మింట్‌కు పంపించి వాటిని కరిగించటానికి టీటీడీ అనుమతి కోరింది. అయితే ఆ కరిగించిన నాణేలను కొనుగోలు చేయటానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఈఓ ఏకే సింఘాల్ మరోసారి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు ప్రధాన కారణం తమిళనాడు రాష్ట్రానికి సేలంకు చెందిన సెయిల్ అనే సంస్థ వాటిని కరిగించి కొనుగోలు చేసుకోవటానికి ముందుకు వచ్చింది. ఇదే విషయాన్ని టీటీడీ యాజమాన్యం ఆర్‌బిఐకి సవివరంగా తెలియజేసింది. దీంతో స్పందించిన ఆర్‌బిఐ ఈ నాణేలను కరిగించి అందుకు సంబంధించిన స్టీలు సేలంకు చెందిన సంస్థకు ఇవ్వడానికి అంగీకరించింది. ఈ నేపథ్యంలో టీటీడీ సేలంకు చెందిన సంస్థతో సంప్రదింపులు జరిపి టన్ను నాణేలను కరిగించిన తరువాత వచ్చే స్టీలుకు రూ. 27 వేలు చెల్లించడానికి పరస్పర అంగీకారం కుదిరింది. ఈ నేపథ్యంలో టీటీడీ వద్ద ఉన్న 90 టన్నుల ఐదు, పది పైసల ద్వారా లభించే స్టీలుకు శ్రీవారికి రూ. 24 లక్షల 30 వేలు ఆదాయం లభించనుంది. నాణేలను నిల్వ ఉంచడానికి స్థల భారం, చెల్లని నాణేలకు కొంత సొమ్ము రావడంతో టీటీడీ యాజమాన్యం కూడా సంతోషం వ్యక్తం చేసింది. శ్రమించి కూడబెట్టుకొని కానుకలు సమర్పించిన భక్తుల మొక్కులకు కూడా సార్ధకత చేకూర్చినట్టు అయింది.