బిజినెస్

ఆర్థిక నష్టం రూ.8 లక్షల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: గత మూడు వారాలుగా భారత దేశంలో అమలవుతున్న లాక్ డౌన్ వల్ల అనూహ్య రీతిలో దేశ ఆర్థిక వ్యవస్థకు అపారమైన నష్టం కలిగే అవకాశం ఉంది. మంగళవారం ముగుస్తున్న ఈ 21 రోజుల లాక్ డౌన్ కాలంలో దాదాపుగా భారత దేశం అంతా మూత పడింది. ఫ్యాక్టరీలు పని చేయలేదు, వ్యాపారాలు నడవలేదు, విమానాలు తిరగలేదు, రైళ్ళు పట్టాలు ఎక్కలేదు. వాహనాల రాకపోకలు కూడా దాదాపుగా ఆగిపోయాయి. వీటిన్నింటి వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు 7 నుంచి 8 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని విశే్లషకులు, పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరాళనృత్యం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అరికట్టేందుకు గత నెల 25న దేశ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించారు. దాని వల్ల ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, ఎగుమతులతో పాటు అనేక రకాలుగా ప్రతి రంగం స్తంభించిపోయింది. కేవలం అత్యవసర వస్తు సేవలు, కొన్ని ఆర్థిక ఐటీ సేవలు, ప్రభుత్వ సర్వీసులను మాత్రమే ఈ మూడు వారాల లాక్ డౌన్ కాలంలో అనుమతించారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనేక చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటున్న తరుణంలో కరోనా మహమ్మారి పెను భీభత్సాన్ని సృష్టించింది. దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి ఏక సంఖ్యకు పడిపోయే అవకాశం ఉందని విశే్లషకులు చెబుతున్నారు. 2020 ఏప్రిల్ నుంచి 2021 మధ్య కాలంలో దేశ ఆర్థిక వృద్ధి అడుగంటిపోవచ్చునని ‘సెంట్రమ్’ అనే ఓ పరిశోధనా సంస్థ అంచనా వేసింది. ఈ 21 రోజుల లాక్‌డౌన్ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చిన నష్టం 7-8 ట్రిలియన్ రూపాయలుగా ఈ సంస్థ పేర్కొంది. దేశ వ్యాప్తంగా రోజు వారీగా 35 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని మరో సంస్థ అంచనా వేసింది. ఈ లెక్కన 21 రోజుల లాక్ డౌన్ కాలంలో ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం 7.5 లక్షల కోట్లు అని చెబుతున్నారు. కోవిడ్-19 వైరస్ వ్యాప్తి ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే కకావికలం చేసింది. గత నెల తొలి నాళ్ళ నుంచి ఇప్పటి వరకు భారత దేశంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఈ వైరస్ వ్యాప్తి తీవ్రతను బట్టే లాక్ డౌన్ ఎంత కాలం ఉంటుందన్న విషయం ఆధారపడి ఉంటుందని ఈ క్రెడిట్ రేటింగ్ సంస్థ అంచనా వేసింది. రవాణా, హోటల్, రెస్టారెంట్, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయని వెల్లడించింది.